మగవాళ్లు ఏడవడం తక్కువ.. వాళ్లు కఠినంగా ఉంటారు అని అనుకోవడం పొరపాటే.. సాధారణంగా వాళ్లు ఏడ్పు తక్కువ.. బాగా బాధవస్తే తప్ప ఎప్పుడు ఏడవరు.. ఏడిస్తే ఏమౌతుందో చాలా మందికి తెలియదు.. అసలు మగవాళ్ళు ఎందుకు ఏడవరు? ఏడిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సాదారణంగా మగవాళ్లంటే ఎప్పుడూ గంభీరంగా ఉండాలని చాలా మంది అభిప్రాయం. కానీ మగవారు ఏడుపు, భయం, బాధ వంటి ఎమోషన్స్ ను అణిచివేయడం వల్ల వారిలో కోపం, అసహనం స్థాయిలు పెరుగుతాయని. ఇవి డిప్రెషన్ కు దారితీస్తాయని అంటున్నారు. ఈ ఎమోషన్స్ ను అణిచివేయడం వల్లే అవి మగవారిని కఠినంగా ఉంచుతాయని అంటున్నారు.. కొందరు పరిశోధకులు ఇటీవల మగవారి మానసిక జరిపిన పరిశోధనల్లో నమ్మలేని విషయాలను బయటపెట్టారు..
ఏడ్పు అనేది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సరిచేస్తుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.. బాగా ఏడ్చినపుడు ఆక్సిటోసిన్, ఎండార్పిన్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి శారీరక, మానసిక నొప్పులను కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు.. మగవాళ్ళకు రకరకాల టెన్షన్స్ ఉంటాయి.. వాటి వల్ల ఒత్తిడికి గురవుతారు.. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఇది శరీరంలో ఎక్కువగా విడుదల అవుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం, గుండెకు ప్రమాదం కలగడం జరుగుతుంది. రక్తపోటు సమస్యలు మగవారిలోనే ఎక్కువగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం.. ఏదైనా సందర్భంలో మగవాళ్ళు ఏడిస్తే మంచిది.. లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఏడవొచ్చు.. అప్పుడే ఆ హార్మోన్ కంట్రోల్ లో ఉంటుంది.. గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు.. అబ్బాయిలు విన్నారుగా.. ఏదోక సాకుతో ఆ పని కానివ్వండి..