Hair Oil: చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతుంది. జుట్టు రాలడం, చుండ్రు, చివర్లు చీలిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం నిర్లక్ష్యం, ఎక్కువ కెమికల్ షాంపూల వాడకం, వాతావరణంలో దుమ్ము కాలుష్యం.. ఈ రోజుల్లో స్త్రీ, పురుషుల అనే తేడా లేకుండా జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత యువతలో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. అయితే, పురుషులు దీనితో ఇబ్బంది పడుతున్నారు. 30 ఏళ్లలోపరే జుట్టు రాలిపోవటం పెద్ద సమస్యగా మారుతుంది. దీనికితోడు జుట్టు రాలే సమస్య వల్ల బట్టతలకి దారితీయవచ్చు.
దీనికి ప్రధాన కారణాలు శరీరంలో హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి, ఉప్పు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో కొందరికి ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంది. అయితే కొందరు పని ఒత్తిడి వల్ల జుట్టుకు ఆయిల్ రాయడం మానేసారు. ఇక ఆఫీస్ కు వెళ్లేవారి గురించి చెప్పనక్కర్లేదు.. జుట్టుకు ఎప్పుడు ఆయిరాశారనేది వేళ్లల్లో లెక్కపెట్టవచ్చేమో.. కాగా జుట్టు ఒత్తుగా పెరగాలంటే జుట్టుకు ఆయిల్ రాయడం చాలా ముఖ్యం. ఆయిల్ రాయడమే కాదండోయ్.. మసాజ్ కూడా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందంటున్నారు నిపుణులు.
Read also: Himachal Floods: హిమాచల్‌లో భారీ వర్షాల కారణంగా 43 మంది మృతి,రూ.352 కోట్ల నష్టం
జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయటం చాలా అవసరం.. జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలకు సులభమైన.. సమర్థవంతమైన పరిష్కారం ఏమిటంటే, నూనెను తలపై నుండి మూలాల వరకు అప్లై చేసి 15 నిమిషాల పాటు మసాజ్ చేయడం. ఇలా వారానికి కనీసం 2 లేదా 3 సార్లు చేస్తే తలలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలడం అదుపులో ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
జుట్టు సమస్యను దూరం చేసే మెంతులు.. వంటలో రుచిని పెంచేందుకు ఉపయోగించే మెంతులు జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం అని మీకు తెలుసా. ఈ చిన్న గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టు మూలాలకు పోషకాలను అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెంతులను వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు ఇది మంచి మందు అని నిపుణులు చెబుతున్నారు.
తాలింపుకే కాదు జుట్టు సమస్యను దూరం చేసే కరివేపాకు..
కరివేపాకులో ప్రోటీన్లు, బీటా కెరోటిన్ మరియు జుట్టు రాలడాన్ని తగ్గించే మంచి అమినో యాసిడ్స్ ఉంటాయి. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. బట్టతలను నివారిస్తుంది. కరివేపాకులో అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. హెయిర్ ఫోలికల్స్ స్ట్రాంగ్ గా, హెల్తీగా చేస్తుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.