పీరియడ్స్ అనేవి అమ్మాయిలకు ప్రతి నెల వస్తుంటాయి. ఇదంతా కామనే.. అయితే.. ఇలా వచ్చినప్పుడు.. అమ్మాయిలు చెప్పలేని భాధను అనుభవిస్తారు. కొందరు ఈ నొప్పిని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలుకూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.. ఓ మగాడికి పీరియడ్స్ వస్తున్నాయి. విన్న మీరు షాకయినప్పటికి ఇదే నిజం.. అతడే స్వయంగా ఈ విషయాన్ని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు..
Read Also: Health Benefits of Turmeric: పసుపుతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫిలిపీన్స్ కు చెందిన ఓ యువకుడికి ప్రతినెల అమ్మాయిల లానే పీరియడ్స్ వస్తున్నాయని చెప్పడంతో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. మ్మాయిల మాదిరిగానే నొప్పి, రక్తస్రావం, మూడ్ స్వింగ్స్ ఉంటాయని తెలిపాడు. దీంతో అతను భాగస్వామిని పొందేందుకు కష్టపడ్డానని.. తన పరిస్థితిని ముందే వివరిస్తే ఎవరూ నమ్మలేదని చెప్పాడు.
Read Also:Shocking Incident: దారుణం..రోగి కాళ్లు చేతులు కట్టేసి.. భోజనం పెట్టిన సిబ్బంది
ఈ విషయాన్ని తెలుసుకున్న డాక్టర్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అతన్ని పరీక్షించిన ఎక్స్పర్ట్స్ పర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి ఉందని గుర్తించారు. ఇలాంటి స్థితిలో పురుషులు కొన్ని స్తీలకు సంబంధించిన పునరుత్పాదక అవయవాలను కలిగి ఉంటారని వైద్యులు వెల్లడించారు. కాగా నోయెల్ కడుపులో ఉన్న టిష్యూ సైక్లికల్ బ్లీడింగ్కు కారణమవుతందని.. ఇది రుతుస్రావం లాగానే ఉందని గుర్తించారు.
Read Also:Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్
పర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్ అనేది పురుషులలో ఒక అరుదైన జన్యు సంబంధిత వ్యాధని వైద్యులు వెల్లడించారు. ఇందులో గర్భంలో అభివృద్ధి దశలో ముల్లేరియన్ డక్ట్లు సరిగ్గా పరివర్తనం కాకుండా… స్త్రీ పునరుత్పాదక అవయవాలు అంటే గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్లు కొనసాగుతాయని వెల్లడించారు. దీంతో పురుష జననేంద్రి అవయవాలు, టెస్టికల్స్ సాధారణంగా ఉండటంతోపాటు అంతర్గతంగా స్త్రీ పునరుత్పాదక అవయవాలను కలిగి ఉంటారు. ఇది ‘ప్సూడోహర్మాఫ్రడిటిజం’ రకంగా పరిగణించబడుతుంది.