LifeStyle : పెళ్లిలో ఈ తప్పులు చేస్తే భార్యభర్తలు విడిపోతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ వ్యవస్థలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది..దేవుడు వేసే బంధం అని చాలా పవిత్రంగా భావిస్తారు..అయితే పూర్వకాలం నుండి పెళ్ళికి ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి.కానీ ఈ మధ్యకాలంలో పెళ్లి విషయంలో అనేక రకాల పొరపాట్లు చేస్తూ పెళ్లిని చాలామంది పట్టించుకోవడం లేదు.ఇక పెళ్లి అనేది గతంలో అయితే జీవితంలో ఒకేసారి వచ్చేది.కానీ ఈ మధ్య కాలంలో చాలామంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. నిజానికి జీవితం ఒకరితోనే ముడిపడి ఉంటుంది.. అయితే పెళ్లి విషయంలో కొన్ని తప్పులు చేస్తే మాత్రం భార్యా భర్తలు విడిపోతారని పండితులు అంటున్నారు.. ఆ తప్పులు ఏంటంటే..
ఈ మధ్యకాలంలో పెళ్లి అనేది ఫ్యాషన్ గా మారిపోయింది.. గొప్పగా చెప్పుకోవడం కోసం ఏవేవో చేస్తున్నారు.. ముఖ్యంగా తలంబ్రాలు పోసుకున్నాక థర్మకోల్ బబుల్స్ తల పై పోసుకోవడం. కానీ ఇలా వాటిని పోసుకోవడం ఏమాత్రం మంచిది కాదు అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఎందుకంటే ఇలా థర్మకోల్ బబుల్స్ పెళ్లిలో వాడడం వల్ల బంధువుల మధ్య గొడవలు జరుగుతాయట. అందుకే వీటిని వాడకుండా కేవలం తలంబ్రాలు మాత్రమే పోసుకోవాలట… అలాగే పెళ్లి జరిగే ప్రదేశంలో చెప్పులను అస్సలు వేసుకోకూడదు.. ఎందుకంటే మండపంలో దేవతలు ఉంటారు.. దైవ సాక్షిగా జరుగుతున్న పెళ్లికి వారు వస్తారు..
Also Read
అందుకే ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు ధరించకూడదు.. అనుకున్న ముహూర్తానికి తాళి కట్టరు. పంతులు పెట్టిన ముహూర్తానికి వధువు మెడలో వరుడు తాళి కట్టకపోతే ఆ పరిణామం తర్వాత చూడాల్సి వస్తుందట.ఎందుకంటే అనుకున్న ముహూర్తానికి పెళ్లి కాకపోతే ఆ వధూవరుల మధ్య గొడవలు వస్తాయట. మరీ ముఖ్యంగా ప్రతి చిన్న విషయంలో గొడవలు వచ్చి చివరికి విడిపోయే వరకు వెళ్తారని చెబుతున్నారు.. అందుకే పెళ్లి ని ఎంత పవిత్రంగా చేసుకుంటామో అంత బలంగా బంధం కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు.. ఈ విషయాలను ఆలోచించండి.. మనం చేసే దాన్ని బట్టే బంధం బలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?