దూమపానం ఆరోగ్యానికి హానీకరం.. ఇది క్యాన్సర్ కు కారణం అవుతుంది అంటూ వైద్యులు పదే పదే చెప్తున్నా కూడా జనాలు అస్సలు వినడం లేదు.. అదొక ట్రెండ్ అయ్యింది.. దాంతో ప్రతి ఒక్కరు కూడా స్మోకింగ్ ను ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు.. దీన్ని మానేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా దీనివల్ల లైంగిక జీవితం మెరుగు పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు..స్మోకింగ్ శరీరంలోని ఏ భాగానికి మంచి చేయదు. పైగా ఇది చర్మం, ఊపిరితిత్తులు, గుండె, పునరుత్పత్తిపై చెడు ప్రభావాన్నిచూపుతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని దెబ్బతీయడమే కాకుండా పడకగదిలో సమస్యలకు కూడా దారితీస్తుంది..
ఈ పొగ త్రాగడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గడం, స్పెర్మ్ చలనశీలత మారడం వంటి వీర్యం పరామీటర్లలో మార్పులకు కారణమవుతుంది. పురుషులు స్మోకింగ్ చేస్తే స్పెర్మ్ కౌంట్ సున్నాకు చేరుతుందని పరిశోధకులు చెబుతున్నారు.. అంతేకాదు అంగస్తంభన పొందడానికి, పురుషాంగాన్ని నిటారుగా ఉంచడంలో సమస్యలు, సెక్స్ చేయాలనే కోరిక తగ్గుతుంది. స్మోకింగ్ అంగస్తంభన పొందడానికి సహాయపడే నరాలు, రక్త నాళాలను దెబ్బతీస్తుందని చెబుతున్నారు.. పురుషుల్లో మాత్రమే కాదు స్త్రీలల్లో కూడా ఇలాంటి అనేక రకాల సమస్యలను కూడా తీసుకొస్తాయని అంటున్నారు..
స్మోకింగ్ అండాశయ నిల్వ తగ్గడానికి కారణమవుతుంది ఇది యోని పొడిబారడం, సెక్స్ లో నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు ఇది ఆడవారిలో తక్కువ లిబిడోకు కారణమవుతుంది. ఏదేమైనా స్మోకింగ్ ను మానేయడం వల్ల ఈ లైంగిక ఆరోగ్య సమస్యలన్నీ మటుమాయం అవుతాయి.. ఇది ఆడ, మగలకు లైంగిక కోరికలను తగ్గిస్తుంది..స్మోకింగ్ మీ శక్తిలో 90 శాతం ఉత్పత్తికి కారణమయ్యే ఆక్సిజన్ ను తీసుకువెళ్ళే శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది. రెగ్యులర్ స్మోకింగ్ స్టామినాను తగ్గిస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది..మీ లైంగిక జీవితాన్ని చిందరవందర చేస్తాయి. ఇది మీకు, మీ భాగస్వామికి తక్కువ సంతృప్తిని కలిగిస్తుంది. దాంతో తనకు పడక సుఖం కలగలేదని ఫీల్ అవుతుంది..ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి.. అదండి మ్యాటర్ అందుకే మానేస్తే పోలే..