ముద్దు పెట్టుకుంటే ప్రేమ పెరుగుతుందని అందరు అనుకుంటారు.. ఇక లవర్స్, కపుల్స్ మూడ్ వస్తుందని భావిస్తారు.. మూడ్ రావడం ఏమో కానీ భయంకరమైన వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఆ వ్యాధి ఎలా వస్తుంది? ఎవరికీ వస్తుంది? లక్షణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆ వ్యాధిని మోనోన్యూక్లియోసిస్ లేదా మోనో లేదా ముద్దు వ్యాధి అనికూడా అంటుంటారు.ఈ ముద్దు వ్యాధి ఎక్కువగా కౌమారదశ, యువకులనే ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు..ఈ వ్యాధి ఎప్స్టీన్-బార్ వైరస్, లేదా EBV వల్ల వస్తుంది. ఇది సంక్రమణకు దారితీస్తుంది.. ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకితుంది..సలైవా ద్వారా ఈజీగా సోకుతాయి.. ఈ వ్యాధి లక్షణాలు..
*. అలసట
*. గొంతు నొప్పి
*. కనీసం 100.4 ఉష్ణోగ్రతతో జ్వరం
*. రోజంతా లేదా రాత్రి మొత్తం చెమటలు
*. వికారం
*. తలనొప్పి
*. చలి
*. ఒంటి నొప్పులు
*. దగ్గు
*.ఆకలి వెయ్యక పోవడం..
నివారణ :
ఈ ముద్దు వ్యాధి బారిన పడకూడదంటే ముందుగా మీ చేతులను తరచుగా సబ్బు, గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవడం అలవాటు చేసుకోండి. చేతులను శుభ్రంగా ఉంచుకుంటే మీకు ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోటికి కర్చీఫ్ ను అడ్డం పెట్టుకోండి.. అప్పుడే ఈ వ్యాధి తీవ్రత తగ్గుతుంది.. నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి.. ఎప్పుడు శుభ్రంగా ఉండాలి..