Salt And BP: ఉప్పు మోతాదు పెరిగితే.. బీపీ బార్డర్ దాటుద్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salt And BP: మనం తినే ఆహారంలో ఉప్పును తప్పకుండా వాడతాము. ఉప్పు లేకపోతే చప్పగా ఉండే ఆహార పదార్థాలను తినలేము. ఉప్పు మోతాదు పెరిగితే కూడా ఏ ఆహారాన్ని తినలేము. అంటే ఉప్పు తక్కువైనా.. ఎక్కువైనా మనకు ముప్పే. అంటే ఉప్పును ఎంత మోతాదులో వాడాలో అంతే మోతాదులో ఉపయోగించాలి. అలా కాకుండా మోతాదుకు మించి ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మామూలు ఆరోగ్య సమస్యలు కావు.. బీపీ పెరిగిపోయి ఏమీ చేస్తున్నారో కూడా తెలియకుండా ఉంటారు. అదుకే ఉప్పును మోతాదుకు తగ్గట్టుగా వాడాలి.. మోతాదు పెరిగితే.. బీపీ బార్డర్ దాటుద్ది.. దాంతో మనిషి కంట్రోల్ తప్పుతాడు.
Read also: Pragya Jaiswal : నాజుకు నడుమందాలతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
కొంతమందిలో హఠాత్తుగా కాళ్లు, చేతుల్లో వాపు వస్తుంది. అధిక మొత్తంలో సోడియం(ఉప్పు) తీసుకోవడమే దీనికి కారణంగా వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ద్రవాలు సమతూకంలో ఉండటానికి, రక్తపోటు నియంత్రణకు, నాడుల స్పందనలు మెదడుకు చేరుకోవడానికి.. సోడియం సహకరిస్తుంది. పాలపదార్థాలు, మాంసం, కూరగాయల ద్వారా ఇది మనకు లభిస్తుంది. ఆహారంలో రుచికోసం ఉపయోగించే ఉప్పులో సోడియం ఉంటుంది. ఆహారం రూపంలో సోడియంను కనుక ఎక్కువగా తీసుకుంటే.. అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఆ రక్తపోటు గుండెజబ్బులు, పక్షవాతం, కిడ్నీ వ్యాధుల ముప్పు పెంచుతుంది. ఎక్కువైన సోడియంను శరీరం నుంచి బయటికి పంపడానికి మరిన్ని నీళ్లు తాగాల్సి వస్తుంది. రక్త ప్రవాహంలో సోడియం ఎక్కువ కావడం వల్ల కణాల నుంచి మరిన్ని నీళ్లను తీసుకుని, దానిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది శరీరం. దీంతో ఒంట్లో నీటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా వాపు, ఉబ్బు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా శరీరంలో ఎక్కువైన సోడియంను బయటికి పంపడానికి మూత్రపిండాలు ‘ఆల్డొస్టిరాన్’ హార్మోన్‌ను మరింతగా విడుదల చేయాల్సి వస్తుంది. దీనివల్ల కిడ్నీల్లో మరిన్ని నీళ్లు, సోడియం పేరుకుపోతాయి. శరీరంలో సోడియం ఎక్కువైన కొద్దీ మనలో దాహం పెరుగుతుంది. దాంతో మరీ మరీ నీళ్లు తాగేస్తాం. సాధారణ ఆరోగ్యవంతుల పరిస్థితి ఇలా ఉంటే, ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారి విషయంలో శరీరంలో ఎక్కువ సోడియం పేరుకుపోవడం అంటే.. కిడ్నీలపై మరింత భారం పడుతుంది.
Read also: Project K : హాలీవుడ్ ఫార్మాట్ ను ఫాలో అవుతున్న వైజయంతి మూవీస్…?
ఇటువంటి వాటిని తప్పించుకోవాలంటే పెద్దలైతే రోజుకు 2.3 గ్రాముల సోడియం మాత్రమే తీసుకోవాలి. కిడ్నీ వ్యాధులు, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు మరింత తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సోడియం కేవలం ఉప్పు నుంచే లభిస్తుందని అనుకుంటాం. బాగా ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఆహారాల నుంచి కూడా సోడియం వస్తుంది. వీటిలో ప్రిజర్వేటివ్‌గా వాడతారు. రుచి కోసం సోడియంను ఎక్కువ మోతాదులో జోడిస్తారు. కాబట్టి, ప్యాకేజ్డ్ పదార్థాలు కొంటున్నప్పుడు సోడియం తక్కువగా ఉన్నవాటినే ఎంచుకోవాలి. డబ్బాల్లో ప్యాక్ చేసిన సూప్‌లు, శీతలీకరించిన ఆహారం, ఇన్స్టంట్ నూడుల్స్ లాంటివాటిలోనూ సోడియం ఎక్కువే. వీటిని పూర్తిగా పక్కన పెట్టాలి. ఒకవేళ తినాలనుకుంటే తక్కువగా తీసుకోవాలి. కొందరికి వివిధ ఆహారాలు, కాయలపై ఉప్పు చల్లుకోవడం అలవాటుగా ఉంటుంది. దీనిని కూడా మానుకోవాలి. అసలు డైనింగ్ టేబుల్ మీద ఉప్పు డబ్బా లేకుండా చూసుకుంటే ఎంతో మంచిది. సాధారణ ఉప్పు, సైంధవ లవణం మార్చిమార్చి వాడుకోవాలి. చిప్స్, ఉప్పుతో వేయించిన గింజలు, చీజ్, ఉప్పులో ఊరబెట్టిన మాంసం, చేపల్లో కూడా సోడియం అధికంగా ఉంటుంది. మనం బయట తినే ప్రాసెస్డ్ ఆహారాలు, రెస్టారెంట్ల భోజనాల రూపంలో తెలియకుండానే సోడియం ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్లిపోతుంది. కాబట్టి, బయటి భోజ నాలను తగ్గించుకుని, ఇంటి వంటకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చిన్నచిన్న మార్పులతో ఉప్పు పరిమాణాన్ని తగ్గించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సమస్యేమి కాదంటున్నారు వైద్యులు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!