NTV Telugu Site icon

Salt And BP: ఉప్పు మోతాదు పెరిగితే.. బీపీ బార్డర్‌ దాటుద్ది

Salt And Bp

Salt And Bp

Salt And BP: మనం తినే ఆహారంలో ఉప్పును తప్పకుండా వాడతాము. ఉప్పు లేకపోతే చప్పగా ఉండే ఆహార పదార్థాలను తినలేము. ఉప్పు మోతాదు పెరిగితే కూడా ఏ ఆహారాన్ని తినలేము. అంటే ఉప్పు తక్కువైనా.. ఎక్కువైనా మనకు ముప్పే. అంటే ఉప్పును ఎంత మోతాదులో వాడాలో అంతే మోతాదులో ఉపయోగించాలి. అలా కాకుండా మోతాదుకు మించి ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మామూలు ఆరోగ్య సమస్యలు కావు.. బీపీ పెరిగిపోయి ఏమీ చేస్తున్నారో కూడా తెలియకుండా ఉంటారు. అదుకే ఉప్పును మోతాదుకు తగ్గట్టుగా వాడాలి.. మోతాదు పెరిగితే.. బీపీ బార్డర్‌ దాటుద్ది.. దాంతో మనిషి కంట్రోల్‌ తప్పుతాడు.

Read also: Pragya Jaiswal : నాజుకు నడుమందాలతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..

కొంతమందిలో హఠాత్తుగా కాళ్లు, చేతుల్లో వాపు వస్తుంది. అధిక మొత్తంలో సోడియం(ఉప్పు) తీసుకోవడమే దీనికి కారణంగా వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ద్రవాలు సమతూకంలో ఉండటానికి, రక్తపోటు నియంత్రణకు, నాడుల స్పందనలు మెదడుకు చేరుకోవడానికి.. సోడియం సహకరిస్తుంది. పాలపదార్థాలు, మాంసం, కూరగాయల ద్వారా ఇది మనకు లభిస్తుంది. ఆహారంలో రుచికోసం ఉపయోగించే ఉప్పులో సోడియం ఉంటుంది. ఆహారం రూపంలో సోడియంను కనుక ఎక్కువగా తీసుకుంటే.. అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఆ రక్తపోటు గుండెజబ్బులు, పక్షవాతం, కిడ్నీ వ్యాధుల ముప్పు పెంచుతుంది. ఎక్కువైన సోడియంను శరీరం నుంచి బయటికి పంపడానికి మరిన్ని నీళ్లు తాగాల్సి వస్తుంది. రక్త ప్రవాహంలో సోడియం ఎక్కువ కావడం వల్ల కణాల నుంచి మరిన్ని నీళ్లను తీసుకుని, దానిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది శరీరం. దీంతో ఒంట్లో నీటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా వాపు, ఉబ్బు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా శరీరంలో ఎక్కువైన సోడియంను బయటికి పంపడానికి మూత్రపిండాలు ‘ఆల్డొస్టిరాన్‌’ హార్మోన్‌ను మరింతగా విడుదల చేయాల్సి వస్తుంది. దీనివల్ల కిడ్నీల్లో మరిన్ని నీళ్లు, సోడియం పేరుకుపోతాయి. శరీరంలో సోడియం ఎక్కువైన కొద్దీ మనలో దాహం పెరుగుతుంది. దాంతో మరీ మరీ నీళ్లు తాగేస్తాం. సాధారణ ఆరోగ్యవంతుల పరిస్థితి ఇలా ఉంటే, ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారి విషయంలో శరీరంలో ఎక్కువ సోడియం పేరుకుపోవడం అంటే.. కిడ్నీలపై మరింత భారం పడుతుంది.

Read also: Project K : హాలీవుడ్ ఫార్మాట్ ను ఫాలో అవుతున్న వైజయంతి మూవీస్…?

ఇటువంటి వాటిని తప్పించుకోవాలంటే పెద్దలైతే రోజుకు 2.3 గ్రాముల సోడియం మాత్రమే తీసుకోవాలి. కిడ్నీ వ్యాధులు, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు మరింత తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సోడియం కేవలం ఉప్పు నుంచే లభిస్తుందని అనుకుంటాం. బాగా ప్రాసెస్‌ చేసిన, ప్యాకేజ్డ్‌ ఆహారాల నుంచి కూడా సోడియం వస్తుంది. వీటిలో ప్రిజర్వేటివ్‌గా వాడతారు. రుచి కోసం సోడియంను ఎక్కువ మోతాదులో జోడిస్తారు. కాబట్టి, ప్యాకేజ్డ్‌ పదార్థాలు కొంటున్నప్పుడు సోడియం తక్కువగా ఉన్నవాటినే ఎంచుకోవాలి. డబ్బాల్లో ప్యాక్‌ చేసిన సూప్‌లు, శీతలీకరించిన ఆహారం, ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ లాంటివాటిలోనూ సోడియం ఎక్కువే. వీటిని పూర్తిగా పక్కన పెట్టాలి. ఒకవేళ తినాలనుకుంటే తక్కువగా తీసుకోవాలి. కొందరికి వివిధ ఆహారాలు, కాయలపై ఉప్పు చల్లుకోవడం అలవాటుగా ఉంటుంది. దీనిని కూడా మానుకోవాలి. అసలు డైనింగ్‌ టేబుల్‌ మీద ఉప్పు డబ్బా లేకుండా చూసుకుంటే ఎంతో మంచిది. సాధారణ ఉప్పు, సైంధవ లవణం మార్చిమార్చి వాడుకోవాలి. చిప్స్‌, ఉప్పుతో వేయించిన గింజలు, చీజ్‌, ఉప్పులో ఊరబెట్టిన మాంసం, చేపల్లో కూడా సోడియం అధికంగా ఉంటుంది. మనం బయట తినే ప్రాసెస్డ్‌ ఆహారాలు, రెస్టారెంట్ల భోజనాల రూపంలో తెలియకుండానే సోడియం ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్లిపోతుంది. కాబట్టి, బయటి భోజ నాలను తగ్గించుకుని, ఇంటి వంటకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చిన్నచిన్న మార్పులతో ఉప్పు పరిమాణాన్ని తగ్గించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సమస్యేమి కాదంటున్నారు వైద్యులు.