How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి బిర్యానీ ఆకు కొనుగోలు చేయడం మానేయండి! మీ ఇంటి బాల్కనీలో లేదా చిన్న కుండీలో ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. పులావ్, బిర్యానీతో పాటు రకరకాల కూరల్లో రుచి, సువాసన కోసం మనం ఈ ఆకులను విరివిగా వాడుతుంటాం. చాలా మంది వీటిని బయట దుకాణాల నుంచే తెచ్చుకుంటూ ఉంటారు. కానీ కొద్దిపాటి శ్రద్ధ పెడితే ఇంట్లోనే ఈ మొక్కను పెంచుకోవడం చాలా ఈజీ. ఇంటి వద్ద టెర్రస్ పైనో, బాల్కనీలోనో లేదా చిన్న కిచెన్ గార్డెన్ ఉంటే అక్కడ ఈ మొక్కను సులువుగా నాటుకోవచ్చు. తగినంత సంరక్షణ అందిస్తే మొక్క క్రమంగా ఎదుగుతుంది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా ఆకులను కోసుకొని వంటల్లో వాడొచ్చు. దీనివల్ల ప్రతీసారి మార్కెట్‌కి వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. అలాగే ఈ మొక్క పెరగడానికి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు.
ఈ మొక్కలు దగ్గర్లోని నర్సరీల్లో సులభంగా దొరుకుతాయి. సాధారణంగా ఒకటి నుంచి మూడు అడుగుల ఎత్తు ఉన్న మొక్కలు అక్కడ లభిస్తాయి. మొక్క సైజ్, ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి మసాలా మొక్కలను పెంచకపోతే, నర్సరీ నుంచి ఆరోగ్యంగా ఉన్న మొక్కను తెచ్చి నాటడమే అత్యంత సులభమైన మార్గం. కుండీలో బిర్యానీ ఆకు మొక్కను పెంచేటప్పుడు ప్రధానంగా మట్టిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కుండీలోని మట్టిలో ఎప్పుడూ నీరు నిలవకూడదు. అంటే నీటిని బాగా ఇంకిపోయే గుణం మట్టికి ఉండాలి. పాటింగ్ మిక్స్ తయారు చేసే సమయంలో మట్టితో పాటు ఇసుక, కొకోపీట్, నాణ్యమైన వర్మి కంపోస్ట్ కలుపుకోవాలి. ఒకవేళ మట్టి నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకుంటున్నట్లయితే, డ్రైనేజ్ కోసం అందులో కొద్దిగా ఇసుక కలపడం మంచిది. అలాగే కుండీ కింద కచ్చితంగా రంధ్రాలు (డ్రైనేజ్ హోల్స్) ఉండాలి. దీనివల్ల అదనపు నీరు బయటకు వెళ్లిపోతుంది. ఈ మొక్కల వేర్లు ఎప్పుడూ తడిగా ఉండటాన్ని ఇష్టపడవు. నీరు ఎక్కువైతే వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. మొదట్లో ఈ మొక్కను పెంచడానికి దాదాపు 12 అంగుళాల సైజ్ ఉన్న కుండీని ఎంచుకోవాలి. మొక్క పెరిగే కొద్దీ 15 అంగుళాలు లేదా అంతకంటే పెద్ద కుండీకి మార్చుకోవచ్చు.
Also Read
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
- Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
బిర్యానీ ఆకు మొక్కను కుండీలో నాటేటప్పుడు ముందుగా తయారీ చేసుకున్న మట్టి మిశ్రమాన్ని ఒక లేయర్‌లా వేయాలి. ఆ తర్వాత నర్సరీ కవర్ నుంచి మొక్కను జాగ్రత్తగా వేర్లకు ఎలాంటి హాని జరగకుండా విడదీసి కుండీ మధ్యలో ఉంచాలి. ఇప్పుడు చుట్టూ మట్టి వేసి చేత్తో సున్నితంగా నొక్కి, తగినన్ని నీళ్లు పోయాలి. ఇక, ఈ మొక్కలకు మంచి వెలుతురు, ఎండ చాలా అవసరం. అందుకే ఎండ బాగా తగిలే చోట వీటిని ఉంచాలి. బాల్కనీ, టెర్రస్ లేదా ఇంట్లో ఎక్కువసేపు ఎండ పడే ప్రాంతం ఈ మొక్క ఎదుగుదలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీ ప్రాంతంలో విపరీతమైన చలికాలం ఉంటే, మొక్కను గడ్డకట్టే చలి నుంచి కాపాడే ప్రదేశానికి మార్చుకోవాలి. అతిగా ఉండే చలిలో ఈ మొక్కల ఎదుగుదల కాస్త మందగిస్తుంది. మొక్క బాగా పెరిగిన తర్వాత ఆకులను ఎప్పుడు కోయాలనేది ముఖ్యం. దీనికోసం ఆకు రంగును గమనించాలి. ఏ ఆకులైతే పచ్చని రంగులోకి మారి పూర్తిగా ఎదుగుదల పూర్తి చేసుకుంటాయో వాటిని కోసుకోవచ్చు. లేత పచ్చగా, కొత్తగా వస్తున్న ఆకులను మాత్రం మొక్కపైనే వదిలేయాలి. ఆకులను చేత్తో పీకడం కంటే కత్తెరను ఉపయోగించి కట్ చేయడం మంచిది. దీనివల్ల కొమ్మ దెబ్బతినకుండా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. తేజ్ ఆకులు(బిర్యానీ ఆకు) ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే, వాటిని కోసిన తర్వాత శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టాలి. ఈ ఆకులను ఎండలో ఆరబెట్టడం కంటే నీడలోనే ఆరబెట్టడం చాలా మంచిది. దీనివల్ల వాటిలోని సువాసన, రుచి అలాగే ఉంటాయి. ఆకులు పూర్తిగా ఎండిన తర్వాత వాటిని ఒక గాలిచొరబడని డబ్బాలో (ఎయిర్‌టైట్ కంటైనర్) భద్రపరుచుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే పండించుకున్న తాజా తేజ్ ఆకులను వంటల్లో నేరుగా ఉపయోగించుకోవచ్చు.
తాజావార్తలు
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!