Moong Dal Halwa Recipe: కోవా లేకుండానే నోరూరించే పెసరపప్పు హల్వా.. ఒక్క కప్పు పాలతో సింపుల్‌గా ఇలా చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moong Dal Halwa Recipe: చలికాలం వచ్చిందంటే చాలు పెసరపప్పు హల్వా తినాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ కోవా వేయాలి, పప్పును గంటల తరబడి వేయించాలి, ఎక్కువ పాలు మరిగించి చిక్కబడనివ్వాలి అనే కష్టానికి భయపడి చాలామంది దీన్ని ఇంట్లో చేయడానికి వెనుకాడుతుంటారు. అయితే కోవా లేకుండా, పెద్దగా శ్రమ పడకుండా కేవలం ఒక్క కప్పు పాలతోనే నోట్లో వేసుకోగానే కరిగిపోయే, పూసపూసలా ఉండే పెసరపప్పు హల్వాను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన కొలతలు తీసుకుని, సన్నని మంటపై ఓపికగా వేయిస్తే చాలు ఈ హల్వా రుచిలో అద్భుతంగా ఉంటుంది. చలికాలం సాయంత్రాల్లో గానీ, ప్రత్యేక సందర్భాల్లో గానీ వేడివేడిగా పెసరపప్పు హల్వా చేసి పెడితే ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
కావాల్సిన పదార్థాలు..
Also Read
- Moringa Millet Khichdi Recipe: చలికాలంలో వేడివేడిగా మునగాకు మిల్లెట్ కిచిడీ.. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం..
- Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
- Bengali Aloo Posto Recipe: ఆలూ కూర తిని విసుగొచ్చిందా? బెంగాలీ స్టైల్లో ఆలూ పోస్తో ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది!
- Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
పొట్టు లేని పెసరపప్పు: 1 కప్పు (3-4 గంటలు నానబెట్టి నీళ్లు వంపేసినది లేదా శుభ్రంగా కడిగి ఆరబెట్టినది)
ఫుల్ క్రీమ్ పాలు: 1 కప్పు
దేశీ నెయ్యి: 1/2 నుంచి 3/4 కప్పు (రుచికి తగినంత)
చక్కెర: 3/4 నుంచి 1 కప్పు (తీపికి తగినట్లుగా)
బొంబాయి రవ్వ లేదా శనగపిండి (ఐచ్ఛికం): 1 టేబుల్ స్పూన్ (పూసపూసగా రావడానికి)
యాలకుల పొడి: 1/2 టీస్పూన్
తరిగిన డ్రై ఫ్రూట్స్ (బాదం, పిస్తా, జీడిపప్పు): 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
కుంకుమపువ్వు రేకులు: 8-10 (1 టీస్పూన్ గోరువెచ్చని పాలలో నానబెట్టినవి, ఐచ్ఛికం)
పెసరపప్పు హల్వా తయారు చేసే విధానం..
నానబెట్టిన పెసరపప్పులో నీళ్లను పూర్తిగా వంపేసి మిక్సీ జార్లో వేయండి. మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కాస్త బరకగా రుబ్బుకోండి. ఇప్పుడు ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి, అందులో రుబ్బిన పెసరపప్పు ముద్దను (కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ రవ్వ కూడా) వేయండి. సన్నని నుంచి మీడియం మంట మీద ఆపకుండా కలుపుతూ, పప్పు బంగారు రంగులోకి మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. పప్పు బాగా వేగిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించండి. ఇప్పుడు అందులో నెమ్మదిగా 1 కప్పు పాలు, కుంకుమపువ్వు కలిపిన పాలు పోస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపండి. పాలు పూర్తిగా ఇగిరిపోయిన తర్వాత చక్కెర వేసి, అది పూర్తిగా కరిగే వరకు ఉడికించండి. హల్వా అంచుల నుంచి నెయ్యి పైకి తేలుతూ పూసపూసలా కనిపించడం మొదలవగానే, అందులో యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపండి. మరో 2 నిమిషాల పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే నోరూరించే హల్వా రెడీ..
తాజావార్తలు
-
Moong Dal Halwa Recipe: కోవా లేకుండానే నోరూరించే పెసరపప్పు హల్వా.. ఒక్క కప్పు పాలతో సింపుల్‌గా ఇలా చేయండి!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
AP Panchayat Elections: తిరుపతి, బాపట్ల జిల్లాల్లో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!
-
Sai Pallavi: సీత పాత్ర ట్రోల్స్.. పెదవి విప్పిన సాయి పల్లవి..!
-
KTR: డీలిమిటేషన్‌తో తెలంగాణలో 180 అసెంబ్లీ స్థానాలు.. 26 లోక్‌సభ సీట్లు పెరుగుతాయ్..!
ట్రెండింగ్
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!