Camphor Tree: పూజల్లో ఉపయోగించే కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Camphor Tree: ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్‌ను నడుస్తుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో పూజలు, ఇతర మతపరమైన ఆచారాలు నిర్వహిస్తున్నారు. పూజ అంటే నిప్పు ఉండాల్సిందే.. ఆ నిప్పును అంటించాలంటే కర్పూరం కావాల్సిందేగా. వాస్తవానికి కర్పూరం అనేది అగ్గిపుల్ల వెలిగించిన వెంటనే మండుతుంది, అలాగే మందమైన, సువాసనను వెదజల్లుతుంది. మీలో ఎంత మందికి తెలుసు.. కర్పూరం ఎలా తయారు అవుతుందో.. ఎప్పుడైనా ఆలోచించారా.. పూజల్లో ఉపయోగించే కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారు అనేది?..
READ ALSO: Wines Tender : మద్యం షాపుల కోసం మహిళల పోటీ.. ఒకే మహిళ 150 షాపులకు దరఖాస్తు..
Also Read
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
రెండు రకాలుగా కర్పూరం తయారీ..
మార్కెట్లో ప్రస్తుతం రెండు ప్రధాన రకాలుగా కర్పూరాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది సహజ కర్పూరం, రెండవది కర్మాగారాల్లో ఉత్పత్తి చేస్తున్న కృత్రిమ కర్పూరం. సహజ కర్పూరం అనేది “కర్పూరం చెట్టు” అనబడే చెట్టు నుంచి లభిస్తుంది. దీనిని శాస్త్రీయంగా సిన్నమోమం కాంఫోరా అని పిలుస్తారు. ఈ కర్పూరం చెట్టు సుమారు 50 నుంచి 60 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది, దీని ఆకులు గుండ్రంగా, 4 అంగుళాల వెడల్పుతో ఉంటాయి. వాస్తవానికి ఈ చెట్టు బెరడు నుంచి కర్పూరం తయారవుతుంది. కర్పూరం చెట్టు బెరడు ఎండిపోవడం ప్రారంభించినప్పుడు లేదా అది బూడిద రంగులోకి మారినప్పుడు, దానిని చెట్టు నుంచి తొలగిస్తారు. ఈ బెరడును వేడి చేసి, శుద్ధి చేసిన, తర్వాత పొడిగా రుబ్బుతారు. చివరగా దానిని అవసరమైన విధంగా వివిధ ఆకారాలలో తయారు చేస్తారు.
కర్పూరం చెట్టు చరిత్ర..
కర్పూరం చెట్టు ప్రధానంగా తూర్పు ఆసియాలో, ముఖ్యంగా చైనాలో ఉద్భవించిందని చరిత్రకారులు నమ్ముతారు. అయితే కొంతమంది వృక్షశాస్త్రజ్ఞులు ఇది జపాన్‌కు చెందినదని విశ్వసిస్తున్నారు. చైనాలో టాంగ్ రాజవంశం (క్రీ.శ. 618-907) కాలంలో కర్పూరం చెట్టును ఉపయోగించి తయారు చేసిన ఒక రకమైన ఐస్ క్రీం బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే ఈ చెట్టును అనేక ఇతర విధాలుగా కూడా ఉపయోగించారు. దీనిని చైనీస్ జానపద వైద్యంలో వివిధ రూపాల్లో ఉపయోగించారు. తొమ్మిదవ శతాబ్దంలో స్వేదనం పద్ధతిని ఉపయోగించి కర్పూరం చెట్టు నుంచి కర్పూరం తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
భారతదేశంలో కర్పూరం కథ..
ఇదే సమయంలో భారతదేశం కూడా కర్పూరం ఉత్పత్తిపై పని చేస్తోంది. 1932లో ప్రచురించిన ఒక పరిశోధనా పత్రంలో.. కలకత్తాలోని స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన ఆర్.ఎన్. చోప్రా, బి.ముఖర్జీ 1882-83లో లక్నోలోని హార్టికల్చర్ గార్డెన్‌లో కర్పూరం ఉత్పత్తి చేసే చెట్లను పెంచడంలో విజయం సాధించారని వెల్లడించారు. తరువాతి సంవత్సరాల్లో దేశంలోని అనేక ప్రాంతాలలో కర్పూరం చెట్ల పెంపకం పెద్ద ఎత్తున ప్రారంభమైంది.
కర్పూర చెట్లకు నల్ల బంగారం అనే పేరు ఎలా వచ్చింది…
కర్పూర చెట్టును నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన చెట్లలో ఒకటిగా పేర్కొంటున్నారు. ఈ చెట్టును కేవలం మతపరమైన ఆచారాలలో ఉపయోగించే కర్పూరం కోసం మాత్రమే కాకుండా, ముఖ్యమైన నూనె, వివిధ మందులు, పరిమళ ద్రవ్యాలు, సబ్బులు వంటి అనేక ఇతర ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. కెమోటైప్స్ అని పిలువబడే ఆరు నిర్దిష్ట రసాయనాలు కర్పూర చెట్టులో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కెమోటైప్స్ ఏమిటంటే.. : కర్పూరం, లినాలూల్, 1,8-సినోల్, నెరోలిడోల్, సఫ్రోల్, బోర్నియోల్‌గా పేర్కొన్నారు.
కర్పూరం అధిక మొత్తంలో కార్బన్, హైడ్రోజన్ కలిగి ఉంటుంది. ఈ గుణాలు కలిగి ఉండటంతో ఇది చాలా కొద్ది వేడిని పొందిన వెంటనే మండడం ప్రారంభిస్తుంది. ఇంకా కర్పూరం చాలా అస్థిర పదార్థం అని పరిశోధకులు చెబుతున్నారు. కర్పూరాన్ని కొద్దిగా వేడి చేసినప్పుడు, దాని ఆవిరి గాలిలోకి వేగంగా వ్యాపిస్తుందని, అలాగే ఇది వాతావరణ ఆక్సిజన్‌తో కలిపినప్పుడు చాలా సులభంగా మండుతుందని వెల్లడించారు.
READ ALSO: Dhanteras 2025: ధన్ త్రయోదశి రోజున ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే అంతే సంగతులు !
తాజావార్తలు
-
CMR Jewellery: గాజువాకలో CMR జువెలరీ షోరూం.. ఘనంగా ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
ట్రెండింగ్
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!