Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Homemade Healthy Snacks: చలికాలం మొదలైందంటే చాలు మన ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వస్తుంటాయి. ఈ సీజన్లో రుచితో పాటు శరీరానికి కాస్త వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారం తినాలనిపిస్తుంది. అందుకే చలికాలంలో నువ్వులు, బెల్లంతో చేసే వంటకాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. నువ్వుల లడ్డూలు, చిక్కీలే కాకుండా నువ్వుల పట్టీని కూడా చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పండుగ రోజుల్లోనే కాకుండా, సాయంత్రం వేళ టీ తాగేటప్పుడు ఏదైనా కరకరలాడుతూ తినాలనిపించినప్పుడు బెల్లం తీపి, వేయించిన నువ్వుల కమ్మదనం కలగలిసిన ఈ పట్టీ భలే రుచిగా ఉంటుంది.
బయట మార్కెట్లో రకరకాల నువ్వుల పట్టీలు దొరుకుతున్నా, ఇంట్లో మన చేతులతో స్వచ్ఛంగా చేసుకుని తినే ఆ మజాయే వేరు. దీన్ని తయారు చేయడానికి పెద్దగా సామాన్లు అవసరం లేదు, గంటల తరబడి వంటగదిలో నిలబడాల్సిన పని కూడా లేదు. కేవలం తెల్ల నువ్వులు, బెల్లం, కొద్దిగా నెయ్యి ఉంటే చాలు.. అచ్చం స్వీట్ షాపుల్లో దొరికే విధంగా పల్చటి, కరకరలాడే నువ్వుల పట్టీని చిటికెలో రెడీ చేసుకోవచ్చు. ఒకసారి చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే, ఎప్పుడు తీపి తినాలనిపిస్తే అప్పుడు తీసుకొని తినొచ్చు.
Also Read
- AMH తక్కువగా ఉంటే IVF తప్పనిసరా? మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలు...
- Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
- Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
- Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
కావాల్సిన పదార్థాలు:
*తెల్ల నువ్వులు ఒక కప్పు
*తురిమిన లేదా చిన్న ముక్కలుగా చేసిన బెల్లం ఒక కప్పు
*నెయ్యి ఒక పెద్ద స్పూన్ (ప్లేట్‌కు రాయడానికి కొద్దిగా అదనంగా)
*మంచి వాసన కోసం చిటికెడు యాలకుల పొడి
తయారు చేసే పద్ధతి:
ముందుగా స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి వేడి చేయండి. అందులో తెల్ల నువ్వులు వేసి, మంటను తక్కువలో పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు ఆపకుండా కలుపుతూ వేయించండి. నువ్వులు లేత గోధుమ రంగులోకి మారి కమ్మటి వాసన రాగానే స్టవ్ ఆపేయాలి. నువ్వులను మరీ ఎక్కువగా వేయిస్తే చేదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మరో మందపాటి కడాయిలో బెల్లం, ఒక స్పూన్ నెయ్యి వేసి సన్నని మంటపై కరిగించండి. బెల్లం ఎక్కడా ఉండలు లేకుండా పూర్తిగా కరిగే వరకు గరిటెతో తిప్పుతూనే ఉండాలి. పాకంలో నురగలాగా రావడం మొదలయ్యాక, ఒక గిన్నెలో చల్లటి నీళ్లు తీసుకుని అందులో రెండు చుక్కల పాకం వేసి చూడండి. నీళ్లలో వేయగానే పాకం గట్టిపడి, విరిస్తే టక్కున విరిగిపోతే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు లెక్క. ఒకవేళ సాగుతున్నట్లు మెత్తగా ఉంటే మరికాసేపు ఉడికించాలి.
పాకం రెడీ అయిన వెంటనే స్టవ్ ఆపేసి, అందులో వేయించి పెట్టుకున్న నువ్వులు, యాలకుల పొడి వేసి వేగంగా కలపండి. ఈ మిశ్రమం చాలా త్వరగా గట్టిపడిపోతుంది కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నువ్వులన్నింటికీ బెల్లం పాకం పట్టేలా కలపాలి. ఆ తర్వాత ముందే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ లేదా బటర్ పేపర్ మీదకు ఈ మిశ్రమాన్ని వేయండి. చపాతీ కర్రకు కొద్దిగా నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాకుతో చతురస్రాకారం లేదా డైమండ్ షేప్‌లో గాట్లు పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత అది గట్టిగా, కరకరలాడుతూ తయారవుతుంది. అప్పుడు ముక్కలను విడివిడిగా తీసి డబ్బాలో వేసుకుంటే రెండు వారాల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.
ఈ చిన్న విషయాలు గుర్తుపెట్టుకోండి
నువ్వులను ఎప్పుడూ సన్నని మంట మీదే వేయించాలి, అప్పుడే అవి మాడిపోకుండా లోపలి వరకు వేగుతాయి. బెల్లం పాకం సరిగ్గా ఉడికితేనే పట్టీ పంటికి అంటుకోకుండా క్రిస్పీగా వస్తుంది. మిశ్రమాన్ని చపాతీ కర్రతో ఎంత పల్చగా ఒత్తుకుంటే పట్టీ అంత కరకరలాడుతుంది. ఒత్తేటప్పుడు కర్రకు, కట్ చేసేటప్పుడు చాకుకు కాస్త నెయ్యి రాస్తే పాకం అంటుకోకుండా నీట్‌గా వస్తుంది. ఇంకాస్త రుచి కావాలనుకునే వాళ్లు ఇందులో సన్నగా తరిగిన బాదం పలుకులు లేదా వేయించిన పల్లీ ముక్కలు కూడా కలుపుకోవచ్చు. చలికాలంలో సాయంత్రం వేడివేడి టీతో పాటు తినడానికి ఈ కరకరలాడే నువ్వుల పట్టీ సూపర్ కాంబినేషన్.
నువ్వుల పట్టీతో ఆరోగ్య లాభాలు ఎన్నో
రుచికి రుచి అందించే ఈ నువ్వుల పట్టీ, చలికాలంలో మన శరీరానికి గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇందులో వాడే ప్రధాన పదార్థాలైన నువ్వులు, బెల్లం రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
* నువ్వులు, బెల్లం రెండింటికీ శరీరంలో వేడిని పుట్టించే గుణం ఉంటుంది. చలికాలంలో వీటిని తినడం వల్ల బయటి చలి తట్టుకునే శక్తి రావడంతో పాటు, సీజనల్ జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
* నువ్వుల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక చిన్న ముక్క నువ్వుల పట్టీ తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.
* బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. నువ్వులు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది. మహిళలకు, పెరిగే పిల్లలకు ఇది మంచి పోషకాహారం.
* భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే నువ్వుల్లో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గించి, జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేసేలా చేస్తుంది.
* చలికాలంలో చర్మం పొడిబారకుండా నువ్వుల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్-ఇ కాపాడతాయి. అంతేకాకుండా అలసటగా అనిపించినప్పుడు ఒక నువ్వుల పట్టీ తింటే శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది.
నోట్: ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి షుగర్ సమస్య ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
-
Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
-
Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
-
UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
-
Sabarimala : తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!