Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News High Fiber Protein Diet With Healthy Jowar Breakfast Recipe For Weight Loss

Jowar Breakfast Recipe: వెయిట్ లాస్‌కు సూపర్ రెసిపీ.. జొన్నలతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్

Published Date :January 4, 2026 , 1:53 pm
By Kothuru Ram Kumar
Jowar Breakfast Recipe: వెయిట్ లాస్‌కు సూపర్ రెసిపీ.. జొన్నలతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Jowar Breakfast Recipe: ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది ఒక్క రోజు నిర్ణయంతో వచ్చేది కాదు.. రోజూ మనం తీసుకునే చిన్న చిన్న అలవాట్ల సమాహారమే నిజమైన హెల్త్‌కు పునాది. సరైన ఆహారం ఎంపిక చేయడం, శరీరానికి అవసరమైన పోషకాలను సహజమైన మార్గంలో అందించడం, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండడం వంటి అలవాట్లు బరువు నియంత్రణతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్‌ను హెల్తీగా తీసుకోవడం రోజంతా ఎనర్జీ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

హై ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే సంప్రదాయ ధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా వెయిట్ మేనేజ్మెంట్ కూడా సులభమవుతుంది. అలాంటి మంచి హెల్త్ హ్యాబిట్స్‌లో భాగంగా, ఈరోజు మనం జొన్నలతో తయారుచేసుకునే సింపుల్ అండ్ న్యూట్రిషన్‌తో నిండిన బ్రేక్ ఫాస్ట్ రెసిపీని తెలుసుకుందాం. ఇది జొన్నలతో త్వరగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. ఉదయాన్నే కాకుండా బాగా ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్‌గా కూడా దీనిని సర్వ్ చేసుకోవచ్చు. ఇది హై ఫైబర్, హై ప్రోటీన్ ఉన్న ఈ రెసిపీ వెయిట్‌ను చక్కగా మేనేజ్ చేయడంలో సహాయపడుతుంది.

Also Read

  • Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
  • Palathalikalu Recipe : రుచికరమైన పాలతాలికలు.. పక్కా కొలతలతో తయారీ విధానం ఇలా..!
  • Annavaram Prasadam Recipe: అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం.. ఇలా చేస్తే టెంపుల్‌ టేస్ట్‌ ఉంటుంది..!
  • Achari Lauki Salad Recipe: వేసవిలో చల్లని సొరకాయ ఊరగాయ సలాడ్.. సులభమైన టేస్టీ రెసిపీ..
Add as a preferred
source on google

Hyderabad: డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి.. పాముతో పోలీసులను భయపెట్టిన ఆటో డ్రైవర్

అంతేకాదు శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలన్నీ కూడా అందిస్తుంది. త్వరగా బరువు తగ్గి, వెయిట్‌ను కంట్రోల్ చేయాలనుకునే వారు కనీసం వారంలో రెండు నుంచి మూడు సార్లు అయినా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి. ఈ రెసిపీ తయారీ ప్రక్రియ చాలా సింపుల్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు జొన్నలను వేసి శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇక్కడ పచ్చ జొన్నలైనా, తెల్ల జొన్నలైనా ఉపయోగించవచ్చు. జొన్నలు బాగా నానితే అవి సులభంగా ఉడుకుతాయి.. అంతేకాదు జీర్ణక్రియకు కూడా మంచిగా ఉంటాయి.

బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకునే అరగంట ముందు మరో గిన్నెలో 1/3 కప్పు పెసరపప్పు, 1/3 కప్పు వేరుశెనగ గుళ్లు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి. ఇవి ఎక్కువ సేపు నానాల్సిన అవసరం లేదు. జస్ట్ హాఫ్ అవర్ నానితే సరిపోతుంది. జొన్నలు, పెసరపప్పు, వేరుశెనగ గుళ్లు బాగా నానిన తర్వాత నీళ్లు పూర్తిగా వడగట్టి ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. జొన్నలు కొలిచిన కప్పుతోనే రెండు కప్పుల నీళ్లు వేసి, రుచికి సరిపడా ఉప్పు జోడించాలి. మీడియం ఫ్లేమ్‌పై సుమారు ఎనిమిది విసిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆపి ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసుకోవాలి. జొన్నలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వాటిలో ఉన్న నీటిని పూర్తిగా వడగట్టి పక్కన పెట్టాలి.

ఆ తరువాత జొన్నలకు తాలింపు పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇష్టమైతే నెయ్యితో కూడా తాలింపు పెట్టుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వంటి తాలింపు గింజలు వేసి దోరగా వేయించాలి. తరువాత సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు, అల్లం తురుము, చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, రెండు రెమ్మల కరివేపాకు వేసి మరోసారి బాగా వేయించాలి.

Minister Savitha: ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదు..

ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు వేసి, త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు చల్లాలి. ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా మారిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ వేసి కలపాలి. తరువాత ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టిన జొన్నలను పాన్‌లోకి వేసి హై ఫ్లేమ్‌లో రెండు నుంచి మూడు నిమిషాలు బాగా టాస్ చేయాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపిన తర్వాత అర నిమ్మకాయ రసం పిండితే రుచి మరింత బాగుంటుంది.

ఇలా జొన్నలతో సింపుల్‌గా, త్వరగా తయారయ్యే హెల్తీ వెయిట్ లాస్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్‌ను కామెంట్ రూపంలో షేర్ చేయండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • healthy breakfast ideas
  • Healthy Indian Breakfast
  • high fiber breakfast
  • Jowar breakfast recipe
  • jowar recipe for weight loss

తాజావార్తలు

  • Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్

  • India-Pakistan: “పాకిస్తాన్‌తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..

  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!

  • SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…

  • Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions