High BP Control Tips : రోజూ వీటిని తింటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా కంట్రోల్ అవుతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా బీపి షుగర్ లతో బాధపడుతున్నారు.. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. చాప కింద నీరులా ఈ సమస్య శరీరం మొత్తాన్ని గుల్లబారేలా చేస్తుంది. అధిక రక్తపోటు వల్ల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. గుండె కవాటాలు మూసుకుపోతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక బీపీని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే మనం జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి నెలకొంది.. మందులను రెగ్యూలర్ గా వాడటంతో పాటు కొన్ని ఆహారం పదార్థాలను కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హై బీపి సమస్య ఉన్నవాళ్లు పల్లీలను ఎక్కువగా తీసుకోవచ్చు..పల్లీలల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. పల్లీలను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు తొలగిపోతుంది. అంతేకాకుండా పల్లీలను తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. ప్రతి రోజు గుప్పెడు పల్లీలను నానబెట్టి తీసుకుంటే మంచిది..
Also Read
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
బాదంపప్పును తీసుకోవడం వల్ల కూడా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే బాదంపప్పును తీసుకోవడం వల్ల శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. శరీరం బలంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. కనుక రోజూ 4 లేదా 5 బాదంపప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున పొట్టు తీసి తినాలి. ఇలా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది… అదే విధంగా జీడీ పప్పులను తీసుకోవడం మంచిది..అధిక రక్తపోటు తగ్గడంతో పాటు షుగర్ అదుపులో ఉంటుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో కూడా దాదాపు విటమిన్ ఎ, బి1, బి6, ఇ లతో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి.. ఏదైనా లిమిట్ గా తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!