Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oil Free Poori: నార్మల్ డైలీ రొటిన్ టిఫిన్లతో పోల్చితే పూరీ – కూర పేరు వినగానే ఎవరికైనా నోరూరుతుంది. సెలవు రోజైనా, ఇంట్లో శుభకార్యమైనా, చుట్టాలు వచ్చినా మన ఇళ్లలో పూరీ ఉండాల్సిందే. అయితే పూరీ తినడానికి ఎంత రుచిగా ఉంటుందో, దానిని డీప్ ఫ్రై చేయడానికి అంతకంటే ఎక్కువ నూనె (ఆయిల్) పడుతుంది. దీంతో ఆరోగ్యంపై శ్రద్ధ చూపే చాలా మంది, బరువు పెరుగుతామనే భయం కారణంగా ఈ పూరీలకు దూరంగా ఉంటున్నారు. మీరు కూడా ఈ లిస్టులో ఉంటే ఇకపై అస్సలు బాధపడకండి.. ఎందుకంటే ఒక్క చుక్క నూనె కూడా లేకుండా, కుండలా పొంగే క్రిస్పీ పూరీలను తయారు చేసుకునే ఒక అద్భుతమైన వంటింటి చిట్కాను ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా 'కారపన్నం' చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Vitamin Guide for Every Organ: మెదడు నుంచి ఎముకల వరకు.. ఏ అవయవానికి ఏ విటమిన్ కీలకం..?
గోధుమ పిండి – 2 కప్పులు
వాము – అర టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
గోరువెచ్చని నీరు – సరిపడా
తయారీ విధానం..
ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి తీసుకుని, అందులో ఉప్పు, వాము వేయాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా గోరువెచ్చని నీటిని పోస్తూ పిండిని గట్టిగా (చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా) కలుపుకోవాలి. పూరీ పిండి ఎప్పుడూ కాస్త గట్టిగా ఉంటేనే పూరీలు బాగా వస్తాయి. పిండిని కలిపిన తర్వాత దానిపై మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల పిండి బాగా నానుతుంది, పూరీలు చేసుకునే సమయంలో విరిగిపోకుండా ఉంటాయి.
తర్వాత పిండిని మరోసారి చేత్తో మెత్తగా చేసి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీటపై పూరీల సైజులో గుండ్రంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టాలి. అందులో 1 నుంచి 2 గ్లాసుల నీళ్లు పోయాలి. కుక్కర్ లోపల ఒక చిన్న స్టాండ్ ఉంచాలి (దీనివల్ల మనం పెట్టే ప్లేట్ నీటిని తాకకుండా పైకి ఉంటుంది). ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని, పూరీలు అంటుకోకుండా ఉండటానికి దానికి చాలా తక్కువగా నెయ్యి లేదా నూనె రాయాలి. ఒత్తుకున్న పూరీలను ఆ ప్లేట్లో పెట్టి, ఆ ప్లేట్‌ను కుక్కర్ లోపల ఉన్న స్టాండ్‌పై ఉంచాలి. ఇప్పుడు ఆ కుక్కర్‌కు మూత పెట్టాలి. కానీ కుక్కర్‌కు విజిల్ పెట్టకూడదు. హై ఫ్లేమ్‌పై కేవలం 3 నుంచి 4 నిమిషాల పాటు పూరీలను ఆవిరిపై ఉడకనివ్వాలి. కొన్ని నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే, చక్కగా పొంగిన నూనె లేని పూరీలు రెడీగా కనిపిస్తాయి. వీటిని ఆలూ కుర్మా, చోలే మసాలా లేదా పెరుగుతో కలిపి వేడివేడిగా వడ్డించుకోని తింటే ఉంటుందీ..
ఈ పద్ధతి ఎందుకు ప్రత్యేకం అంటే..
పూరీలను నూనెలో డీప్ ఫ్రై చేయకపోవడంతో, ఇందులో ఫ్యాట్ (కొవ్వు), క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. గుండె జబ్బులు ఉన్నవారు, హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునే వారికి ఈ పద్ధతి ఒక బెస్ట్ ఆప్షన్‌గా పని చేస్తుందని చెబుతున్నారు. నూనె లేకుండా ఆవిరిపై చేసినప్పటికీ, ఈ పూరీలు ఎంతో రుచిగా, సాఫ్ట్‌గా ఉంటాయి. కాబట్టి డైట్ పేరుతో పూరీ తినాలనే మీ కోరికను ఇకపై చంపుకోనవసరం లేదు. ఇకపై మీకు పూరీలను తినాలనిపించినప్పుడు మీ ఇంట్లో ఈ ‘కుక్కర్ పూరీ’ ట్రిక్‌ను ట్రై చేసి చూడండి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?