WHO: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ఓ ప్రకటన వివాదానికి దారితీసింది. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో టైలెనాల్ (పారాసెటమాల్) తీసుకోకూడదని ఆయన అన్నారు. ఈ ఔషధం పిల్లలలో ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ఆటిజం కేసులకు ఈ ఔషధం కారణమని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా గందరగోళలం నెలకొంది. వైద్యులు పారాసెటమాల్ సురక్షితమైందని.. ఆటిజంతో దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది.
READ MORE: Crypto Fraud : తెలంగాణలో వెలుగులోకి క్రిప్టో కరెన్సీ మోసం.. రైతుల పేర్లతో రూ.170 కోట్లు..
ట్రంప్ వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) పూర్తిగా తోసిపుచ్చాయి. ఇప్పటివరకు జరిగిన పరిశోధనలలో పారాసెటమాల్, ఆటిజం మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని WHO పేర్కొంది. ఇప్పటికే అన్ని నిబంధనలు పాటిస్తూ.. ప్రజలకు ప్రయోజనాలు చేకూరుస్తున్న మందులను రాజకీయం చేయడం తగదని స్పష్టం చేసింది. మరోవైపు.. గర్భిణీ స్త్రీలకు నొప్పి, జ్వరాన్ని తగ్గించడానికి పారాసెటమాల్ సురక్షితమైన ఎంపిక అని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పేర్కొంది. ఈ అంశంపై EMA చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. అన్నీ శాస్త్రీయ డేటాను పరిశీలించామని.. పారాసెటమాల్ పిల్లలలో ఆటిజంకు కారణమవుతుందని ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. 2019లో నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ ఔషధ దానికి.. పిల్లలలో న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్ మధ్య ఎటువంటి సంబంధం లేదని కనుగొన్నట్లు తెలిపారు.
READ MORE: IND vs PAK: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. ఆసియా కప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడికల్ అసోసియేషన్ రెండింటి ప్రకారం.. గత కొన్ని దశాబ్దాల డేటాని సమీక్షించారు. పారాసెటమాల్ ఉపయోగించిన తల్లులకు జన్మించిన శిశువులలో జనన లోపాల ప్రమాదం కనిపించలేదు. కొన్ని పరిశోధనలు ఆటిజం, ADHD మధ్య సంబంధాన్ని సూచించినప్పటికీ.. పారాసెటమాల్ కారణమని నిర్ధారించలేదు. మరోవైపు.. వైద్యుల ప్రకారం గర్భధారణ సమయంలో జ్వరం, నొప్పి నివారణకు పారాసెటమాల్ మాత్రమే సురక్షితమైన ఎంపిక.