MPOX: అలర్ట్..భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ! విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి వైరస్ లక్షణాలు!
- దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసు
- రోగిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు వెల్లడి
- చింతించాల్సిన పనిలేదని స్పష్టం చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మంకీపాక్స్ అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. రోగిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చింతించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. అనుమానాస్పద మంకీపాక్స్ కేసులో పరీక్షలు జరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓ యువకుడికి ఇలాంటి లక్షణాలు కనిపించాయి. అతడు ఇటీవల మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ ఉన్న దేశంలో ప్రయాణించినట్లు కనుగొన్నారు. ఇటీవల మన దేశానికి తిరిగి వచ్చాడు. అతని శరీరంపై మంకీపాక్స్ కు సంబంధించిన లక్షణాలు కనిపించాయి. రోగిని నియమించబడిన ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించి, ఆరోగ్య సేవలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో అన్ని సంబంధిత శాఖలు మరియు ఏజెన్సీలు అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి.
READ MORE: Vizag: విశాఖలో కుండపోత వర్షం.. ప్రమాదకర స్థితిలో ఇళ్లు
Also Read
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
- Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
- Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
ఆరోగ్య మంత్రిత్వ శాఖ
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) ఈ విషయాన్ని పరిశీలిస్తున్నందున ఈ విషయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి ప్రయాణ సంబంధిత విషయాలను ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తెలియజేసింది. అలాగే, అటువంటి కేసులను గుర్తించడానికి ట్రేసింగ్ ఛానల్ ఏర్పాటు చేయబడింది.
READ MORE: Rains Effect: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో రేపు విద్యా సంస్థలకు సెలవు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది?
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వందలాది మంకీపాక్స్ కేసులు మరో మహమ్మారికి దారి తీసే అవకాశంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వ్యాధి గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. మంకీపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయం సహా దశాబ్దాల కిందే మశూచి టీకాల కార్యక్రమాన్ని నిలిపివేయడం వల్ల ఇది వేగంగా సంక్రమించడానికి వీలవుతుందా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. ప్రపంచదేశాల్లో వెలుగుచూస్తున్న మంకీపాక్స్ కేసుల్లో అధిక శాతం స్వలింగ, ద్విలింగ సంపర్కులు, పురుషులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న పురుషుల్లోనే అనేది నొక్కి చెప్పడం ముఖ్యమని డబ్ల్యూహెచ్ఓ డా.రోజమండ్ లూయిస్ సోమవారం ఓ సభలో అన్నారు. అప్పుడే దీనిపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేయగలరగని, రిస్క్ ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోగలరని చెప్పారు. అయితే లైంగిక ధోరణితో సంబంధంలేకుండా ఎవరికైనా వ్యాధి సోకే ప్రమాదముందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!