AC usage: వేసివి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఉష్ణోగ్రతల నమోదు ఎక్కువైంది. దీంతో ప్రజలు ఈ వేడి నుంచి తట్టుకునేందుకు ఎయిర్ కండిషనర్లు(ఏసీ)లను ఆశ్రయిస్తున్నారు. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు ఏసీలే మంచి మార్గమని భావిస్తున్నారు. అయితే, దీర్ఘకాలికంగా వీటి వినియోగం తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం, శ్వాసవ్యవస్థకు సంబంధించిన సమస్యలకు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఎక్కువ కాలంల ఏసీకి గురికావడం వల్ల చర్మం పొడివారడం, పేలుసుగా మారిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తోంది. తలనొప్పి, పొడిదగ్గు, తల తిరగడం మరియు వికారం, ఏకాగ్రతలో ఇబ్బంది, అలసట వంటి అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయంలో ఏసీల కింద గడపొద్దని సూచిస్తున్నారు. ఏసీలకు సరైన ఫిల్టర్ వ్యవస్థ లేకపోవడంతో కాలుష్యం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా కొన్ని మంచి కంపెనీలు, బ్రాండెడ్ ఏసీలు మాత్రమే HEPA ఫిల్టర్‌లు కలిగి ఉంటాయి. నిపుణులు ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
Read Also: Missing: తెలంగాణ యువతి అమెరికాలో అదృశ్యం..
హోమ్ AC సెటప్‌ల కంటే కమర్షియల్ హీటింగ్, వెంటిలేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ (HVAC) సెటప్‌లో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇళ్లలో వాడే ఏసీల్లో కూలింగ్ సిస్టమ్‌లోని కూలింగ్ కాయిల్స్‌పై బ్యాక్టీరియాలు బయోఫిల్మ్ ఏర్పరుస్తాయి. 90 శాతం కన్నా ఎక్కువ సమయం ఏసీలకు గురికావడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ డైరెక్టర్ & యూనిట్ హెడ్ సతీష్ కౌల్ తెలిపారు.
లిజియోనైర్స్ వంటి వ్యాధికి దారి తీయవచ్చు. ఇది న్యూమోనియా యొక్క తీవ్రమైన రూపం. HVAC వ్యవస్థలో నీరు కలుషితం కావడం మరియు దాని పర్యవసానంగా ఏరోసోల్ మిస్ట్ విలక్షణమైన బ్యాక్టీరియా వ్యాప్తికి దారితీయడం ఆధారంగా లెజియోనైర్స్ వ్యాధి రావచ్చని తెలిపారు. తీవ్రమైన వేడికి గురికావడం నుండి అకస్మాత్తుగా చల్లని AC గదిలోకి నడవడం, బ్రోంకోకాన్‌స్ట్రిక్షన్‌కు కారణం కావచ్చని, ఇది వాయుమార్గాన్ని ఇరుకుగా చేయవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆస్తమా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏసీలను సరిగా క్లీన్ చేయాలని, ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.