Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
- పాలకూరలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు
- చట్నీకి కావాల్సిన పదార్థాలు
- సులభంగా తయారు చేసే విధానం
- ఎన్నో రోజులు తాజాగా నిల్వ చేసే చిట్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palakura Chutney Recipe in Telugu: సాధారణంగా మనం ప్రతిరోజూ ఇళ్లలో టిఫిన్లలోకి పచ్చిమిర్చి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా ఎండుమిర్చి చట్నీలనే తయారు చేస్తుంటాం. రోజూ ఒకే రకమైన చట్నీలు తిని బోర్ కొట్టిన వారికి, రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే ‘పాలకూర చట్నీ’ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.
పోషకాల గని – పాలకూర
పాలకూరలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం , ఫైబర్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత (ఎనీమియా) సమస్యను నివారించడంలో , ఎముకలను బలంగా ఉంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వేడివేడి అన్నం, చపాతీ, ఇడ్లీ , దోశల్లోకి ఈ చట్నీ ఎంతో రుచిగా ఉంటుంది.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
- Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
- పాలకూర: 1 కప్పు (శుభ్రం చేసినది)
- నూనె: 2 టేబుల్ స్పూన్లు
- మినపపప్పు, శనగపప్పు: ఒక్కో టేబుల్ స్పూన్
- తురిమిన కొబ్బరి: అర కప్పు
- తెల్ల నువ్వులు: 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు: 5 నుండి 7
- పచ్చిమిరపకాయలు: 2 (కారానికి తగినట్లుగా)
- చింతపండు: ఒక చిన్న ముక్క
- ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
ముందుగా పాలకూరను ఆకులుగా వేరు చేసి నీటిలో శుభ్రంగా కడగాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో నూనె వేసి, నూనె వేడెక్కాక పాలకూరను వేసి సన్నని మంటపై మెత్తబడే వరకు వేయించి వేరొక పాత్రలోకి తీసుకోవాలి.
అదే పాన్‌లో మరో స్పూన్ నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేయించాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపపప్పు వేసి దోరగా వేయించి, చివరిగా తురిమిన కొబ్బరి, నువ్వులు, ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
దింపిన మిశ్రమం చల్లారిన తర్వాత, వేయించిన పాలకూర, మసాలాలు, చింతపండు, ఉప్పు , కొద్దిగా నీళ్లు చేర్చి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర చట్నీ సిద్ధమవుతుంది. ఈ చట్నీని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటుంది.
తాజావార్తలు
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!