Site icon NTV Telugu

Lung Infections: జాగ్రత్త మిత్రమా.. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ల బరిన పడ్డవారిలో మగవారే అధికం..

దేశ రాజధాని దిల్లీ తరహాలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీంతో గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఈ వాయు కాలుష్యం ధాటికి ఊపిరితిత్తులు విలవిలలాడుతున్నాయి. ఈ అవయవంలో క్యాన్సర్లకు కారణమవుతోంది. గాల్లోని మసి రేణువుల వల్ల ప్రధానంగా ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం వల్ల లంగ్‌ అడినోకార్సినోమా (ఎల్‌ఏడీసీ) అనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు పెరిగిపోతున్నట్లు తేలింది. అదే సమయంలో పొగాకు వినియోగం తగ్గడం వల్ల లంగ్‌ స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా (ఎల్‌ఎస్‌సీసీ) అనే మరో క్యాన్సర్‌ ఉద్ధృతి తగ్గుతున్నట్లు వెల్లడైంది. వాయు కాలుష్యాన్ని, ధూమపానాన్ని తక్షణం తగ్గించాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది.

READ MORE: Modi-Trump: 5ఏళ్ళ తర్వాత మోడీ-ట్రంప్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ..

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వాయు కాలుష్యం, ఊపిరితిత్తి ఇన్‌ఫెక్షన్లతో ఆసుపత్రిలో చేరే ముప్పు 65 ఏళ్లు పైబడ్డవారికి లేదా ఇతరత్రా జబ్బులతో బాధపడేవారికి మరింత ఎక్కువగా ఉంటోంది. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఈ కాలుష్యం వల్ల మగవారికీ ఎక్కువ ప్రమాదం జరుగుతోంది. నైట్రోజన్‌ ఆక్సైడ్, పీఎం2.5 లేదా పీఎం10 ప్రభావానికి గురైన మగవారు 50% ఎక్కువగా ఆసుపత్రిలో చేరుతుండటం గమనార్హం. అదే ఆడవారికి సుమారు 3 శాతమే ముప్పు ఉంటోంది. ఫ్లూ, న్యుమోనియా విషయంలోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తున్నప్పటికీ దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో పోలిస్తే అంత బలమైన సంబంధం కనిపించలేదు.

READ MORE: Its Complicated: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అందుకే రీ రిలీజ్: సిద్ధు జొన్నలగడ్డ

Exit mobile version