దేశ రాజధాని దిల్లీ తరహాలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీంతో గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఈ వాయు కాలుష్యం ధాటికి ఊపిరితిత్తులు విలవిలలాడుతున్నాయి.