ప్రోటీన్ పౌడర్ అనేది కండరాల నిర్మాణానికి, బరువు తగ్గడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, మార్కెట్‌లో లభించే ప్రోటీన్ పౌడర్‌ల ఖరీదు ఎక్కువ. అంతే కాకుండా వాటిలో ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు, చక్కెర వంటి పదార్థాలను కలుపి ఉండొచ్చు. ఇవేమీ లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, సరసమైన ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడం మంచిది. ఇంట్లో తయారు చేసిన ప్రోటీన్ పౌడర్‌లో రుచి, అవసరాలకు అనుగుణంగా పదార్థాలను కలపొచ్చు. ఇది పూర్తిగా సురక్షితమైనది. ఇందులో పోషకాహారం కూడా సమృద్ధిగా ఉంటుంది. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం..
READ MORE: CWC meeting: నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు
మీకు కావాల్సిన పదార్థాలు -నో ఫ్యాట్ మిల్క్ పౌడర్ – 3 కప్పులు, డ్రై ఓట్స్ – 1 కప్పు, బాదం పప్పు – 1 కప్పు, కొద్దిగా బెల్లం లేదా పంచదార కానీ కావాలనుకుంటే. ఒక పావు కప్పు కోకోవా పౌడర్ కూడా కలుపుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. వీటన్నింటినీ కలిపి మిక్సీలో పొడి చేసి గాలి చొరని డబ్బాలో పెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఫ్రిజ్‌లో దాచుకోవచ్చు. ఇది ప్రతి రోజూ వాడితే ఎంతో మంచిది. ఒక అర కప్పు ప్రొటీన్ పౌడర్ లో 180 క్యాలరీలూ, 12 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఈ పౌడర్ ని పాలలో కలిపి తాగచ్చు, లేదా స్మూతీల్లో, షేక్స్ లో కలిపి కూడా తీసుకోవచ్చు.
READ MORE: Vemulawada : వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో అన్యమత ప్రచారం
ఇది కాకుండా మరో పద్ధతితో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: బాదం పప్పూ, పిస్తా పప్పు, వాల్నట్స్, వేరుశెనగపప్పూ, సోయా బీన్స్, గుమ్మడి గింజలూ, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఓట్స్, పాల పొడి.. అన్నీ పావు కప్పు చొప్పున తీసుకోండి. పాల పొడి తప్ప మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోండి. అన్నీ కలిపి రోస్ట్ చేస్తే కొన్ని మాడిపోయే ప్రమాదం ఉంది. కొన్ని వేగకపోవచ్చు. ఇవి చల్లారిన తరువాత మిల్క్ పౌడర్ తో కలిపి మిక్సీ లో పొడి చేసుకోండి. ఆ పొడిని జల్లిస్తే మెత్తని పౌడర్ తయారౌతుంది. ఇందులో మీకు కావాలనుకుంటే పావు కప్పు కోకోవా పౌడర్ కూడా కలుపుకోవచ్చు. జల్లెడ లో మిగిలిన దాన్ని పారెయ్యక్కరలేదు. ఏ పాయసం లోనో, హల్వా లోనో కలిపేయొచ్చు. దీన్ని కూడా పాలలో, స్మూతీల్లో, షేక్స్ లో కలిపి తాగచ్చు. ఒక స్కూప్ పౌడర్ లో సుమారుగా పదకొండు గ్రాముల ప్రొటీన్, 45 క్యాలరీలు ఉంటాయి.