ప్రోటీన్ పౌడర్ అనేది కండరాల నిర్మాణానికి, బరువు తగ్గడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, మార్కెట్‌లో లభించే ప్రోటీన్ పౌడర్‌ల ఖరీదు ఎక్కువ. అంతే కాకుండా వాటిలో ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రుచులు, చక్కెర వంటి పదార్థాలను కలుపి ఉండొచ్చు. ఇవేమీ లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన, సరసమైన ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకోవడం మంచిది.
వ్యాయామం అనే ఆరోగ్యాన్ని, శారీరక ధృడత్వాన్ని ప్రోత్సహించడానికి, మానసిక శ్రేయస్సును పెంపొందించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల గుండెకు రక్త ప్రసరణ పెరుగుతుంది. మానసిక స్థితి మెరుగుపడడంతో పాటు బరువు పెరగకుండా కాపాడుతుంది. వ్యాయామం కండరాలు, ఎముకల బలాన్ని పెంచుతుంది.