Tongue Colors: నాలుకలో వచ్చే మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. మన జీవన విధానంలో నాలుకపై పెద్దగా శ్రద్ధ పుట్టం చాలా అరుదు. కానీ ఏదైనా జబ్బు కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు మొదట డాక్టర్ నాలుకనే చూస్తారు. నాలుకను చూస్తే కాలేయం వంటి అనేక వ్యాధుల లక్షణాలు బయటపడతాయి. అందుకే నాలుక రంగును బట్టి శరీర ఆరోగ్యాన్ని చెబుతారు వైద్యులు. మనలో చాలా మంది నిర్లక్ష్యం చేసే శరీర భాగం నాలుక. మనం బ్రష్ చేసినప్పుడు మాత్రమే నాలుకను శుభ్రం చేసుకుంటాము. అయితే ఆ తర్వాత నాలుక రంగు మారుతుందా? దానివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? అనేది మనం గ్రహించము. కానీ శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే, నాలుక అనేక విధాలుగా ప్రభావితమవుతుంది. ఇది మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం డాక్టర్ దగ్గరకు వెళితే వాళ్ళు మన నాలుక వైపు ఎందుకు చూస్తారు? నాలుక ద్వారా మన సమస్యలను తెలుసుకోవచ్చా అని ప్రశ్నిలు మొదలవుతుంటాయి. అయితే ఇప్పుడు మన నాలుక ఏ రంగులో ఉందో తెలుసుకుందాం.
Read also: Anasuya Bharadwaj: అను ఏంటి కొత్త అవతారం..స్టైలిష్ హెయిర్ స్టైల్ తో క్రేజీ లుక్స్..
మీ నాలుక పైభాగంలో తెల్లటి పూత కనిపిస్తే, మీరు మీ నాలుకను సరిగ్గా శుభ్రం చేయడం లేదని అర్థం. అంటే మీరు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. మీ నాలుకపై తెల్లటి పూత ఉంటే, మీ నాలుకపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయని అర్థం. కానీ అది డీహైడ్రేషన్ సమస్య వల్ల కూడా కావచ్చు. నాలుక గరుకుగా ఉండి, స్ట్రాబెర్రీల బయట ముళ్లలా కనిపించడాన్ని స్ట్రాబెర్రీ నాలుక అంటారు. ఇది ముఖ్యంగా బి విటమిన్ల క్షీణతను సూచిస్తుంది. ఈ వ్యాధి రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొంతమందికి నాలుక నల్లగా ఉంటుంది. నాలుక ఇలా కనిపిస్తే మీరు ఎక్కువగా సిగరెట్ తాగుతున్నారు అని అర్థం. అలాగే కాఫీ లేదా టీ తాగితే కూడా ఇది జరుగుతుంది. ఇది యాంటీబయాటిక్స్ యొక్క మితిమీరిన వినియోగాన్ని కూడా సూచిస్తుంది. మీ నాలుకపై కొద్దిగా నీలం లేదా ఊదా రంగు కనిపిస్తే.. మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని అర్థం. ఇది గుండె మరియు ఊపిరితిత్తుల వంటి అవయవాలకు సంబంధించిన వ్యాధులను కూడా సూచిస్తుంది.
Secunderabad To Goa Trains: సికింద్రాబాద్-గోవా వీక్లి ట్రైన్.. ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..