NTV Telugu Site icon

Kids Using Mobile: మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే వారికి మాటలు రావు..

Phone

Phone

మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీ, ఇవి మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అవి లేకుండా మనం ఆఫీసులో పనిచేయలేం. పడుకోము, తినము. పెద్దవారిలోనే కాదు పిల్లల్లో కూడా స్క్రీన్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు తమ పని తాము చేసుకునేందుకు చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. పిల్లలు క్రమంగా దానికి బానిసలవుతున్నారు. పిల్లవాడు మొబైల్ చూడకుండా తిండి తినడు. మొబైల్ ని ముందు పెట్టుకుని తినే పిల్లలను మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు. వీటి వల్ల జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి.

READ MORE: Bird Flu: బుసలు కొడుతున్న బర్డ్ ఫ్లూ.. లక్షలాదిగా కోళ్లు మృత్యువాత

ఆరు నెలలు దాటిన తర్వాత పిల్లలకు మాటలు రావడం ప్రారంభం అవుతుంది. ఆ వయసులో స్క్రీన్‌కు అలవాటైన వాళ్లకు మాత్రం మాటలు తొందరగా రావని వైద్య నిపుణులు తెలిపారు. ఇప్పటికైనా ప్రస్తుత తల్లిదండ్రులు మారాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే.. ఎన్ని ఆస్పత్రులకు తిరిగిన ఫలితం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు! “ఆరు నెలల వయసు నుంచి పిల్లలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో పిల్లల చేతికి ఫోన్‌ ఇచ్చామంటే ఇక ఆ వీడియోలకు అలవాటు పడి చుట్టూ ఏం జరుగుతుందో ఎక్కువగా పట్టించుకోరు. ఫలితంగా మూడేళ్లకు కూడా మాటలు రావు. ఈ పరిస్థితి ఏడీహెచ్‌డీ, ఆటిజం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలు తినడం లేదని, అల్లరి చేస్తున్నారని వారి చేతికి ఫోన్‌లు ఇవ్వద్దు.” అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

READ MORE: Modi-Trump: 5ఏళ్ళ తర్వాత మోడీ-ట్రంప్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ..