NTV Telugu Site icon

Health: చలికాలంలో వేడి నీళ్ల స్నానం మంచిదా..? చలి నీళ్ల స్నానం మంచిదా..?

Bath

Bath

చలికాలం వచ్చిదంటే చాలు స్నానం చేయడానికి జంకుతారు. ఎందుకంటే.. వేడి నీళ్లైనా, చలి నీళ్లైనా.. చల్లగానే ఉన్నట్లు అనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చలికాలంలో కొందరు రెండ్రోజులకోసారి, మూడ్రోజులకోసారి స్నానం చేస్తారు. మరి కొందరు చలి నీళ్లతోనైనా ప్రతీ రోజూ స్నానం చేస్తారు. ఎక్కువగా అయితే.. చాలా మంది వేడి నీళ్లతోనే స్నానం చేస్తారు. అయినప్పటికీ.. ఇప్పటికీ చాలా మందికి సరిగ్గా స్నానం ఎలా చేయడం తెలియదు. ఈ క్రమంలో స్నానం ఎలా చేయాలో ఆయుర్వేద నిపుణులు కొన్ని పద్ధతుల గురించి చెప్పారు. అవేంటో తెలుసుకుందాం…..

Read Also: Goa: టూరిస్ట్ బోటు బోల్తా.. ఒకరి మృతి.. 20 మంది సేఫ్!

సరిగ్గా స్నానం చేయడం ఎలా..?
పురాతన కాలంలో చెరువు లేదా నదిలో స్నానం చేసే సంప్రదాయం ఉండేది. అందులో ప్రజలు నేరుగా స్నానం చేసేవారు. చెరువులో లేదా నదిలో స్నానం చేస్తే వెంటనే తల తడిసిపోతుంది. దీంతో.. శరీర ఉష్ణోగ్రత వెంటనే పడిపోతుంది. అయితే ఈ సంప్రదాయం క్రమంగా తగ్గిపోయింది. ఇంట్లోనే స్నానాలు చేస్తున్నారు. అయితే.. ఎప్పుడూ తల నుండి స్నానం చేయాలని.. ముందుగా తలపై నీరు పోసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

ఇలా స్నానం చేయడం ప్రమాదకరం..
నిజానికి తలపై నీళ్లు పోసుకుంటే తక్షణమే తల చల్లబడుతుంది. స్నానం చేసేటప్పుడు తలపై నీరు పోయకుండా.. పాదాలకు లేదా శరీరానికి పోసుకునే వారు చాలా మంది ఉంటారు. అలా చేయడం ప్రమాదకరమని అంటున్నారు. తలపై కాకుండా శరీరంపై నీటిని పోయడం వల్ల.. తల వైపు వేడి పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

శీతాకాలంలో స్నానం చేయడానికి ఏ నీరు అవసరం..?
చలికాలంలో స్నానం చేయడం చాలా కష్టం. ఈ సీజన్‌లో తలస్నానానికి గోరువెచ్చని నీరు ఉత్తమం. గోరువెచ్చని నీరు మరీ వేడిగానూ, చల్లగానూ ఉండదు. దీనితో తలస్నానం చేయడం వల్ల చర్మానికి ఎలాంటి హాని కలగకుండా శరీరానికి ఉపశమనం కలుగుతుంది.

Show comments