Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్‌గా ఇలా చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Vadiyalu: ఎండా కాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఇళ్లలో రకరకాల వడియాల సందడి మొదలవుతుంది. సాధారణంగా బియ్యం పిండితో వడియాలు పెట్టుకోవడం అందరికీ అలవాటే. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగిపిండితో కూడా అంతే రుచికరంగా, కరకరలాడే వడియాలను సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు అనే విషయం మీలో ఎంత మందికి తెలుసు. ఈ రాగి వడియాలను సింపుల్‌గా ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
రాగిపిండి: 1 కప్పు
సగ్గుబియ్యం: 1/4 కప్పు (మిక్సీ పట్టిన పొడి)
నీళ్లు: మొత్తం 8 కప్పులు (కలపడానికి 2 కప్పులు + ఎసరు కోసం 6 కప్పులు)
పచ్చిమిర్చి: 3 నుంచి 5 (కారం తగినంత)
అల్లం: చిన్న ముక్క
వాము: 1/2 టీస్పూన్
నువ్వులు: 1 టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం..
ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు రాగిపిండి – మిక్సీ పట్టిన పావు కప్పు సగ్గుబియ్యం పొడి తీసుకోవాలి. ఇందులో రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో ఆరు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో తయారు చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్, వాము, నువ్వులు వేసి బాగా మరిగించాలి.
ఆ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం చిక్కబడే వరకు సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. పిండి ఉడికిన తర్వాత స్టవ్ ఆపి కొంచెం చల్లారనివ్వాలి. ఒక కాటన్ వస్త్రాన్ని తడిపి పరిచి, దానిపై చిన్న చిన్న గరిటెలతో వడియాలను పెట్టుకోవాలి. వీటిని ఎండలో లేదా ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు. అంతే సింపుల్ ఈ వడియాలు బాగా ఎండిన తర్వాత వడియాలు రెడీ అయి పోతాయ్.
నిల్వ – వేయించడం
వడియాలు బాగా ఎండిన తర్వాత వస్త్రం వెనుక భాగంలో కొద్దిగా నీళ్లు చిలకరిస్తే అవి సులభంగా ఊడి వస్తాయి. వీటిని మరో రోజు ఎండలో ఆరబెట్టి డబ్బాలో భద్రపరుచుకోవాలి. కావాల్సినప్పుడు వేడి నూనెలో వేయిస్తే ఇవి రెట్టింపు సైజులో పొంగి, ఎంతో కరకరలాడుతూ ఉంటాయి. రాగులలో క్యాల్షియం – ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వేసవిలో శరీరానికి చలవ చేసే రాగిపిండితో ఇలా వడియాలు చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
తాజావార్తలు
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!