అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్ ను వాడుతారు.. అదే అబ్బాయిలు పర్సును వాడుతుంటారు..పర్సును చాలా మంది మగవారు ప్యాంట్ వెనుక జేబులో పెడుతూంటారు. ఎందుకుంటే పెట్టుకోవడానికి, తీసుకోవడానికి సులువగా ఉంటుందని.. ఇలా వెనుక జేబులో పెట్టుకోవడం వల్ల దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతూంటాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్యాంట్ వెనుక పాకెట్ లో పెట్టుకోవడం వల్ల పలు రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి సమస్యలు వస్తాయో వివరంగా తెలుసుకుందాం..
ఇలా వెనుక పెట్టడం వల్ల భుజాలు, మెడ, వెన్ను సమస్యలు వస్తాయి. ఇప్పటికే చాలా మంది ఈ సమస్యలను ఫేస్ చేసే ఉంటారు. చాలా మంది వాలెట్ లో ఎన్నో రకాల కార్డ్స్, డబ్బులు, బిల్స్ వంటివి అందులోనే పెడుతూంటారు. చాలా మంది అనవసరం అయినవి కూడా ఉంచుతారు.. బరువు అనేది పెరుగుతుంది.. అందుకే వెన్ను సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు..
వెనుక జేబులో ఉంచుకోవడం వల్ల తుంటి ఎముకలోని కండరాలు, కీళ్లు ఒత్తిడికి గురవుతాయి. అంతే కాకుండా బరువు ఉండటం వల్ల ఆటో మెటిక్ గా చాలా మంది ఒక వైపుకు వంగి నడుస్తూంటారు. ఈ విషయాన్ని ఎవరూ సరిగ్గా గమనించరు.. ఇలా చెయ్యడం వల్ల రోజు రోజుకు నొప్పి పెరుగుతుంది.. ఇది గుర్తుంచుకోండి..
ప్రస్తుతం ఫోన్ లోని యాప్స్ ద్వారా చాలా పనులు అవుతున్నాయి. కాబట్టి వాలెట్ అవసరం అయినవి తప్పించి.. మిగిలినవి వదిలేయడం మంచిది. అలేగే ఎప్పటికప్పుడు పనికి రాని బిల్స్ ను తొలగించుకుంటూ ఉండాలి . దీని వల్ల వాలెట్ బరువు అనేది కాస్త తగ్గుతుంది.. ఈ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.. అలాగే పర్సును అలానే పెట్టుకోవాలి.. ఇలా చెయ్యడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.