Health Tips : కొత్త చెప్పులు కరుస్తున్నాయా? ఈ టిప్స్ మీకోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మాయిలకు కొత్త బట్టలు, నగలు మాత్రమే కాదు కొత్త చెప్పులను కూడా కొంటుంటారు.. డ్రెస్సులకు మ్యాచ్ అయ్యేలా కొంటారు.. అయితే కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు అవి ఒక్కోసారి కరుస్తాయి.. అవి అలవాటయ్యే వరకు.. మన పాదాలకు రాసుకుంటాయి. దాంతో చిన్న గాయం లేదా దద్దుర్లు ఏర్పడతాయి. చెప్పులు కాళ్లను కరుస్తుంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది, సౌకర్యవంతంగా నడవలేం కూడా. అంతేకాదు, కొన్ని సార్లు చెప్పులు వదులుగా ఉంటాయి. కొత్త చెప్పులు కరవకుండా, వదలైన చెప్పులు సౌకర్యవంతంగా వేసుకోవడానికి.. ఎలాంటి టిప్స్ ను ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మనం కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు.. కాళ్లకు డియోడరెంట్ లేదా హెయిర్ సీరమ్ అప్లై చేయండి. ఇలా చేస్తే.. పాదాలు, పాదరక్షలకు మధ్య రాపిడి తగ్గుతుంది. దీంతో మీరు సౌకర్యవంతంగా నడవచ్చు.. ఎటువంటి గాయాలు కావు..
Also Read
- Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
కొత్త చెప్పులు వేసుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనె లేదా పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోండి. ఇలా చేస్తే చెప్పులు కాళ్లకు పట్టుకోవు.. గాయాలు అవ్వవు..
ఇకపోతే న్యూడ్ కలర్ సాక్స్‌లు వేసుకోండి. ఇలా చేస్తే.. చెప్పులు కాళ్లను కరవకుండా ఉంటాయి.
చాలామంది ఎత్తు మడమల చెప్పులు వేసుకున్నప్పుడో, కాస్త వదులుగా ఉన్న చెప్పులూ, కొత్త బూట్లతో నడుస్తున్నప్పుడో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యల్ని తగ్గించుకోవాలంటే ‘హీల్ గ్రిప్స్, హై హీల్ ప్యాడ్స్ ఉంటాయి. ఇవి వేసుకుంటే.. సౌకర్యవంతంగా నడవచ్చు..
బ్యాండెయిడ్ లేదా సర్జికల్ టేప్ వేయండి. వీటిలోనూ ట్రాన్‌స్పరెంట్ రకాలు ఉంటాయి. వాటిని వేసుకుంటే కనిపించవు, పైగా సౌకర్యవంతంగా ఉంటాయి.. ఇకపోతే బేబీ పౌడర్ ను వేసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవు.. చల్లగా ఉంటుంది..
చెప్పులు కరిచిన చోట, బొబ్బలు ఏర్పడి చోట కలబంద గుజ్జు అప్లై చేయండి. కలబందలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి, మంటను తగ్గిస్తాయి..
ఇక గాయాలు మంటగా ఉంటాయి ఆ చోట ఐస్ క్యూబ్ తో మసాజ్ చెయ్యడం మంచిది.. నొప్పి వెంటనే తగ్గుతుంది.. ఈ టిప్స్ ఫాలో అయితే ఇక ఎటువంటి భాధలు ఉండవు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!