చాలామంది అందం పెంచుకోవడానికి చాలా తాపత్రయపడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే అందం విషయంలో మీరు సెంట్రాఫ్ అట్రాక్షన్ కావచ్చు. అరటిపండు గుజ్జుకు కాస్త తేనె, చెంచాడు నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసి చూడండి. పావుగంట ముగిశాక చేతిని కాస్త తడి చేసుకుంటూ రుద్ది, చల్లని నీటితో కడిగేయాలి. మీ ముఖం మీద వున్న మృతకణాలు తొలగడమే కాదు, చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
మీ ఇంట్లో కలబంద ఉంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు. పావుకప్పు కలబంద గుజ్జుకు బాదం నూనె కలిపి ముఖానికి, మెడకి రాయాలి. వీటిల్లోని విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. పావుగంట ఉంచుకుని కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది. చిన్న బొప్పాయి ముక్క రెండు స్పూన్ల ఓట్స్, స్పూన్ పంచదార, కాస్త తేనె కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. ముఖానికి, మెడకి పట్టించి ఐదునిముషాలు మర్ధన చేసి, కాసేపు వదిలేయాలి. తర్వాత రౌండ్ గా రుద్దుతూ కడిగేస్తే మీ ముఖంగా అందంగా మారుతుంది.
ముల్తానీ మట్టికి కొన్ని పుదీనా ఆకులు కొంచెం పెరుగు కలిపి మెత్తగా చేసి పెట్టుకోవాలి. దానిని తీసుకుని ముఖానికి రాసుకోవాలి, అది ఆరాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై దద్దుర్లు, మొటిమలు, మృతకణాలు నశిస్తాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమల తాలూకు మచ్చలు మటుమాయం అవుతాయి. చలికాలం ముఖం, చేతులపై మాయిశ్చర్ పోతుంది. అందుకే మీరు నేచురల్ గా ఉండేలా.. ఇంట్లో ఉండే కొబ్బరినూనెను చేతులకు, ముఖానికి రాసుకోండి. కాసేపు అయిన తర్వాత ముఖం మంచినీళ్ళతో కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖంపై తేమ నిలిచి వుంటుంది. ఇలాంటి చిన్ని చిన్ని చిట్కాలతో మీరు మెరిసిపోవచ్చు. ఈ చిట్నాలన్నీ సహజ సిద్ధంగా లభించే వాటితో చేయడం వల్ల ఎలాంటి అనర్థాలు మనకు కలగవు. సురక్షితంగా తక్కువ ఖర్చుతో అందాన్ని పెంచుకోవచ్చు,
Read Also: Spy Universe: ఆ రావాలమ్మా రావాలి… ‘స్పై’లు ఎక్కడ ఉన్నా రావాలి…