Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Snacks: మారుతున్న జీవనశైలిలో చిరుతిళ్ల ఎంపిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా కరకరలాడే చిరుతిండి తినాలనిపించడం సహజం. అయితే నూనెతో కూడిన జంక్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యాన్ని, రుచినీ ఒకేసారి అందించే పోషకాల గని ‘రాగులు’. సాధారణ స్నాక్స్‌కు బదులుగా పోషకాలు కలిగిన చిరుధాన్యాలతో ఇంట్లోనే రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. అందులో రాగితో తయారు చేసే మురుకులు, సేవ్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. తక్కువ సమయంలో సులభంగా వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* రాగి పిండి – 1 కప్పు
Also Read
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
- Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
* వరి పిండి – అర కప్పు
* పుట్నాల పప్పు – పావు కప్పు
* అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 చెంచా
* వెన్న – 1 చెంచా
* కారం – 1 చెంచా
* బేకింగ్ సోడా – పావు చెంచా
* ఉప్పు – తగినంత
* మిరియాల పొడి – 1 చెంచా
* వేరుశెనగ నూనె – వేయించడానికి సరిపడా
రాగి మురుకులు తయారీ విధానం
ముందుగా పుట్నాల పప్పును దోరగా వేయించి మెత్తని పొడిగా చేసుకోవాలి. రాగి పిండి, వరి పిండి, పుట్నాల పప్పు పొడిని జల్లించి ఒక గిన్నెలో కలపాలి. ఇందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, బేకింగ్ సోడా, వెన్న వేసి.. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పిండిలా కలుపుకోవాలి. మురుకుల గొట్టానికి కొద్దిగా నూనె రాసి పిండిని నింపాలి. అనంతరం వేడెక్కిన నూనెలో మురుకుల ఆకారంలో ఒత్తి మధ్యస్థ మంటపై వేయించాలి. బుడగలు తగ్గి మురుకులు క్రిస్పీగా మారిన తర్వాత బయటకు తీసి చల్లారనివ్వాలి. రాగి సేవ్ ఎలా చేయాలంటే.. మిగిలిన పిండిలో మిరియాల పొడి కలిపి మరోసారి బాగా కలపాలి. సేవ్ బిళ్ల ఉన్న గొట్టంలో పిండిని నింపి వేడినూనెలో నేరుగా ఒత్తుతూ వేయించుకోవాలి. క్రిస్పీగా మారిన తర్వాత తీసి చల్లార్చి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
ఎముకల పటుత్వం: రాగులలో కాల్షియం అత్యంత సమృద్ధిగా ఉంటుంది. ఇది పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, పెద్దవారిలో కీళ్ల నొప్పులు, బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్) రాకుండా అడ్డుకోవడానికి దోహదపడుతుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ: రాగుల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. మధుమేహం ఉన్నవారికి ఇది ఆరోగ్యకరమైన చిరుతిండి.
జీర్ణక్రియ మెరుగుదల & బరువు నియంత్రణ: ఇందులో అధికంగా ఉండే పీచు పదార్థం (డైటరీ ఫైబర్) జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచి అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది.
రక్తహీనత నివారణ: రాగుల్లో సహజ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి అనీమియా బారిన పడకుండా కాపాడుతుంది.
గుండె ఆరోగ్యం & కొలెస్ట్రాల్ నియంత్రణ: అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా రక్షిస్తాయి.
సహజ రోగనిరోధక శక్తి: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరానికి రోగనిరోధక శక్తిని అందించి కణాల పునరుద్ధరణకు, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!