Site icon NTV Telugu

Corona virus: : 20 కి పైగా దేశాల్లో కరోనా వ్యాప్తి.. వైరస్ మళ్ళీ బలపడిందా?

Covidcases

Covidcases

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంతో సహా 20 కి పైగా దేశాలలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? గత రెండు-మూడు సంవత్సరాల కంటే ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా? వైరస్‌లో ఏదైనా ప్రమాదకరమైన మ్యుటేషన్ జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

READ MORE: IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

ఈసారి కరోనా నమూనాను పరిశీలిస్తే.. JN.1, BA.2.86 కేసులు పెరుగుతున్నాయి. ఈ వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ICMR నుంచి ఈ వేరియంట్లు మునుపటి వాటి కంటే ప్రమాదకరమైనవని నిర్ధారించలేదు. అయితే ఈ వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కానప్పుడు… కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? అనే ప్రశ్న అందరి మదిలో ఉంది.

READ MORE: RCB’s IPL Playoff Record: తొమ్మిదేళ్ల తర్వాత టాప్‌-2లోకి ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌లో ఆ జట్టు రికార్డులు ఇవే..?

అయితే.. వైద్య నిపుణులు దీనికి సమాధానం ఇచ్చారు. “ప్రస్తుతం వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. తేమ, వర్షం, ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ప్రజలకు దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం వంటి సమస్యలు బయటపడుతున్నాయి. ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినప్పుడు.. సమీపంలో ఉన్న ఏదైనా ఇతర వైరస్ కూడా వ్యాపిస్తుంది. కోవిడ్ పూర్తిగా తగ్గుముఖం పడ్డలేదు. అక్కడక్కడా ఇంకా ఉండటం.. ఈ వేరియంట్లలో మార్పుల కారణంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం కరోనా వ్యాప్తికి కారణం.” అని నిపుణులు చెబుతున్నారు.

READ MORE: RCB’s IPL Playoff Record: తొమ్మిదేళ్ల తర్వాత టాప్‌-2లోకి ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌లో ఆ జట్టు రికార్డులు ఇవే..?

కాగా.. మన దేశంలో మళ్లీ కొవిడ్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటకలాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. తన అభిప్రాయం ప్రకారం ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరమని పేర్కొన్నారు. ఎవరైనా క్యాన్సర్‌ రోగులు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు ఉన్నవారైతే.. ఎలాంటి ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Exit mobile version