Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- భయపెడుతున్న చండీపుర వైరస్..
- గుజరాత్లో 22 మంది చిన్నారుల మరణం..
- చండీపుర వైరస్ లక్షణాలు, చికిత్స వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandipura virus: గుజరాత్లో ‘‘చండీపుర వైరస్’’ వ్యాప్తి కారణంగా కనీసం 22 మంది చిన్నారులు మరణించారు. సాధారణ జ్వరంగా కనిపించే ఈ వ్యాధి కొద్ది రోజులకే ప్రాణాంతకంగా మారుతుంది. మెదడు ఇన్ఫెక్షన్గా మారి ప్రాణాలు తీస్తోంది. ప్రస్తుతం గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా ప్రకారం, 184 అనుమానిత కేసులలో మరో 35 మందికి చండీపుర వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చండీపుర వైరస్ వల్ల ఎన్సెఫలైటిస్ అనే పిలిచే తీవ్రమైన మెదడు వాపు రావచ్చు.
అసలేంటి ఈ వైరస్..?
చండీపుర వైరస్, లేదా సిహెచ్పివి (CHPV), రాబ్డోవైరిడే (Rhabdoviridae) కుటుంబంలోని వెసిక్యులోవైరస్ (Vesiculovirus) ప్రజాతికి చెందినది. ఇది ఒక ఆర్బో వైరస్, అంటే ప్రధానంగా ఈగల వంటి రక్తాన్ని పీల్చే కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో ఈ కీటకాల బెడద ఎక్కువగా ఉండటంతో వైరస్ వ్యాప్తి కూడా అధికమవుతుంది. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లల్ని ప్రభావితం చేస్తుంది.
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
లక్షణాలు:
ఈ వ్యాధి సాధారణ జ్వరంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తలనొప్పి, వాంతులు, విరేచనాలు, ఫ్లూ తరహా లక్షణాలు ఉంటాయి. కొందరిలో వైరస్ వేగంగా మెదడుపై దాడి చేసిన ఎన్సెఫలైటిస్ (మెదడు వాపు)కు దారి తీస్తుంది. అయితే, ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకపోవడం సంతోషకరమైన విషయం.
ఇది ఎంత ప్రమాదం.?
మెదడు వాపు వచ్చిన తర్వాత పరిస్థితి వేగంగా విషమిస్తుంది. మూర్చ, స్పృహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం వంటి సమస్యలు రావచ్చు. తీవ్రమైన కేసుల్లో ఆస్పత్రిలో చేరి 48 నుంచి 72 గంటల్లో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రకారం, చండీపురా వైరస్ సోకిన పిల్లల్లో మరణాల రేటు 55 నుంచి 77 శాతం వరకు నమోదైంది.
1965లో తొలిసారిగా గుర్తింపు..
చండీపురా వైరస్‌ను తొలిసారిగా 1965లో భారత్‌లోనే గుర్తించారు. పశ్చిమ, మధ్య భారత దేశంలో ఆ సమయంలో వ్యాధి పలుమార్లు వ్యాప్తి చెందింది. గత రెండు దశాబ్దాలలో అతిపెద్ద వ్యాప్తి 2024లో సంభవించింది, ఆ సమయంలో భారతదేశం 245 తీవ్రమైన ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ కేసులలో 82 మరణాలు సంభవించాయి. ఇందులో 64 చండీపుర ఇన్ఫెక్షన్లుగా నిర్ధారించారు.
చికిత్స ఉందా..?
ప్రస్తుతం చండీపుర కోసం వ్యాక్సిన్ లేదా నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స లేదు. చికిత్స ప్రధానంగా లక్షణాల ఆధారంగా ఉంటుంది. వ్యక్తి వైరస్‌పై పోరాడేలా చికిత్స అందిస్తారు. రోగ నిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడుతున్నప్పుడు, వైద్యులు ఇతర శరీర ప్రక్రియలు విఫలం కాకుండా, ఇతర లక్షణాలు పెరగడకుండా సహాయక చికిత్స అందిస్తారు.
తాజావార్తలు
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు