Health Tips: ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అని పిలువబడే చెడు కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణం. దీంతో కొలెస్ట్రాల్ అనేది ప్రస్తుత సమాజానికి అతిపెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా చిన్నారులు కూడా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. మన జీవనశైలి, తినే ఆహారం, ముఖ్యంగా అధిక కల్తీ నూనెల వాడకం,జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఫలితంగా ఊబకాయం, గుండెపోటుకు గురవుతున్నారు.
Read also: Smartphone Effects: సంసారాల్లో నిప్పులు పోస్తున్న స్మార్ట్‌ఫోన్.. వివో సర్వేలో సంచలన విషయాలు..
మాంసాహారం తినేవారిలో కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు మటన్ తినకూడదు. మటన్ ఎక్కువగా తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు చికెన్ తినే విషయానికొస్తే, మనం ఉడికించిన చికెన్ తింటే, అది మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాకాకుండా చికెన్‌ను ఎక్కువ నూనెలో వండితే అది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు చికెన్ ఉడికిన తర్వాతే తినాలి.
చికెన్ ఫ్రైస్, కడాయ్ చికెన్, బటర్ చికెన్, డీప్ ఫ్రైడ్ వంటి వాటిని తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చికెన్‌ను అతి తక్కువ నూనెలో ఉడికించి తింటే లేదా సూప్‌గా తాగే వారికి కొలెస్ట్రాల్ సమస్యలు ఉండవు. అంతేకాదు బొగ్గుపై కాల్చిన తందూరీ చికెన్ వంటి బార్బెక్యూ చికెన్ తినడం ఆరోగ్యానికి హానికరం కాదు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనం ఏది తిన్నా అది మనం ఉడికించే విధానాన్ని బట్టి, మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది అని చెప్పవచ్చు. కావున కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు మాంసాహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
IND vs AUS: టాస్ గెలిచిన రోహిత్.. మూడు మార్పులతో బరిలోకి భారత్! తుది జట్లు ఇవే