Chikungunya: గోమూత్రంతో చికున్‌గున్యాకు చెక్? ఐఐటీ రూర్కీ అధ్యయనం ఏం చెబుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Can Cow Urine Fight Chikungunya?: చికున్‌గున్యా పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది తీవ్రమైన జ్వరం, భరించలేని కీళ్ల నొప్పులు, వారాలు కాదు నెలల పాటు కొనసాగే శారీరక అసౌకర్యం. ప్రతి వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి దేశంలో మళ్లీ మళ్లీ ఆందోళన కలిగిస్తూనే ఉంది. ఇప్పటివరకు చికున్‌గున్యాను నేరుగా అడ్డుకునే ప్రత్యేక యాంటీవైరల్ ఔషధం అందుబాటులో లేకపోవడంతో శాస్త్రవేత్తలు కొత్త మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ ఆయుర్వేద జ్ఞానం, ఆధునిక బయోటెక్నాలజీ కలయికలో వెలుగులోకి వచ్చిన ఐఐటీ రూర్కీ అధ్యయనం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారతీయ సాంకేతిక విద్యాసంస్థ ఐఐటీ రూర్కీకి చెందిన బయోసైన్సెస్ అండ్ బయోఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ షైలీ తోమర్ నేతృత్వంలోని పరిశోధక బృందం చేపట్టిన అధ్యయనంలో ఆయుర్వేదంలో ప్రస్తావించే గౌ మూత్ర ఆర్క్ అంటే ఆవు మూత్ర డిస్టిలేట్ను పరిశీలించారు. ప్రయోగశాల పరిస్థితుల్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ పదార్థం చికున్‌గున్యా వైరస్ పరిమాణాన్ని 90 శాతానికి పైగా తగ్గించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు సహజ బయోయాక్టివ్ సమ్మేళనాలతో రూపొందించిన ప్రత్యేక ఫార్ములేషన్ వైరల్ లోడ్‌ను 99.85 శాతం వరకు తగ్గించిందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
ఈ పరిశోధనలో వైరస్ నిరోధక ప్రభావానికి కారణమయ్యే పలు బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఫలితాలు పీర్ రివ్యూడ్ శాస్త్రీయ జర్నల్ అయిన ACS(Agricultural Science & Technology)లో ప్రచురితమయ్యాయి. సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే పదార్థాలను ఆధునిక శాస్త్రీయ ప్రమాణాలతో విశ్లేషించవచ్చని ఈ అధ్యయనం మరోసారి చూపించింది.
చికున్‌గున్యా వ్యాధి ఏడిస్ దోమల కాటుతో వ్యాపిస్తుంది. జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది కోలుకున్నప్పటికీ కొందరిలో కీళ్ల నొప్పులు చాలా కాలం కొనసాగుతాయి. ప్రస్తుతం చికిత్స ప్రధానంగా లక్షణాలను తగ్గించడంపైనే ఆధారపడి ఉంది. అందుకే వైరస్‌ను నేరుగా ఎదుర్కోగల కొత్త సమ్మేళనాల అన్వేషణకు ప్రాధాన్యం పెరుగుతోంది.
అయితే ఈ అధ్యయనం వెలుగులోకి వచ్చిందని ప్రజలు ఆవు మూత్రాన్ని స్వయంగా చికిత్సగా ఉపయోగించాలనే అర్థం కాదు. పరిశోధన పూర్తిగా ప్రయోగశాల స్థాయిలో మాత్రమే జరిగింది. మనుషులపై ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ ఇంకా నిర్వహించలేదు. భద్రత, ప్రభావం, మోతాదు వంటి అంశాలపై జంతు పరీక్షలు, క్లినికల్ అధ్యయనాలు, మరిన్ని పరిశోధనలు పూర్తయిన తర్వాత మాత్రమే ఏదైనా వైద్య సిఫార్సు చేయడం సాధ్యమవుతుంది.
ఆరోగ్య నిపుణులు ఇప్పటికీ చికున్‌గున్యా అనుమానం ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని, తగినంత నీరు తాగాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఐఐటీ రూర్కీ పరిశోధన ప్రస్తుతం ఒక ప్రారంభ అడుగుగా మాత్రమే చూడాల్సి ఉంది. అయినప్పటికీ సంప్రదాయ జ్ఞానంలో దాగి ఉన్న సహజ సమ్మేళనాలను ఆధునిక శాస్త్రంతో అధ్యయనం చేస్తే భవిష్యత్తులో కొత్త యాంటీవైరల్ మందుల అభివృద్ధికి మార్గం సుగమం కావచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. శాస్త్రీయ ఆధారాలు మరింత బలపడితే చికున్‌గున్యాపై పోరాటంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు.
- Tags
- #IIT Roorkee
- Chikungunya
తాజావార్తలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!