Hair loss: ఈ మధ్య కాలంలో జట్టు రాలడం, బట్టతల రావడం సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా యువతను ఈ సమస్య వేధిస్తోంది. అయితే ప్రస్తుత జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఇతర ఆరోగ్య సమస్యలు జట్టు రాలడాన్ని పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే ఊబకాయం కూడా జట్టు రాలడాన్ని ప్రేరిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) హార్మోన్ అధిక స్థాయికి దారి తీస్తుందని, ఇది హెయిల్ ఫొలికల్స్ ను తగ్గిస్తుందని, జట్టు రాలిపోయేలా చేస్తుందని చెబుతున్నారు.
భారత దేశంలో పెద్దవారిలో ఊబకాయం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అనారోగ్యమైన జీవన శైలి దీనికి కారణం అవుతోంది. అయితే ఊబకాయం, జట్టు రాలడం మధ్య పరోక్ష సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాలిఫోర్నియాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మాణికం ప్రకాంర.. ఇన్సులిన్ ద్వారా ప్రభావితం అయ్యే ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్ అని పిలువబడే హర్మోన్ ఒకటి జట్టు రాలడానికి కారణం కావచ్చని తెలిపారు. ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ (IGF-1) హెయిర్ బల్బ్ మూలానికి రక్తప్రవాహన్ని పెంచడానికి ముఖ్యమైన హార్మోన్. ఇది జట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జట్టు రాలడాన్ని నివారిస్తుందని ఆయన తెలిపారు.
Read Also: Aravind Swami: మణిరత్నం హీరో ప్రమోషన్స్ లో కనిపించడేం..?
ఈ హార్మోన్ ఇన్సులిన్ లాగా ప్రవర్తిస్తుందని, ఇన్సులిన్ పని చేయనప్పుడు IGF కూడా పని చేయదు, తద్వారా జుట్టు పెరుగుదల తగ్గుతుందని చెప్పాడు. ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ ని నియంత్రిస్తుంది. ఇది కాలేయం, కొవ్వు, కండారాల్లోని గ్లూకోజ్ నిల్వ చేయడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రెట్లు, కొవ్వులు, ప్రోటీన్ల శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. IGF రక్తంలో కన్పించే హార్మోన్. ఇది గ్రోత్ హార్మోన్ పనిచేస్తుంది. హెయిర్ ఫోలికల్స్ అభివృద్ధి సమయంలో సెల్యులార్ విస్తరణ నియంత్రించడం దీని ముఖ్యపాత్ర.
పురుషులలో నడుము చుట్టుకొలత 90 సెం.మీ కంటే ఎక్కువ మరియు స్త్రీలలో 80 సెం.మీ కంటే ఎక్కువ ఉంటే అది బెల్లీ ఫ్యాట్ కు దారి తీస్తుంది. ఇలాంటి వారిలో జట్టు రాలడానికి 90 శాతం అవకాశం ఉంది. పోషకాహారంతో పాటు వారానికి కనీసం 150 నిమిషాల వ్యాయామం ముఖ్యం అని, ఇది ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు సహాయపడుతుంది. తర్వాత హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.