కూరగాయల్లో సోరకాయ ఒకటి. చాలామంది సొరకాయ చాలా ఇష్టంగా తింటారు. సాంబారులో.. పచ్చడి పరంగా ఇది ఉపయోగిస్తారు. దీనిని ఆనికాయ అనే చాలా మందికి తెలుసు. ఇది కుకుర్బిటేసి అనే కుటుంబానికి చెందింది. కుకుర్బిటేసి కుటుంబం అంటే గుమ్మడికాయ, పుచ్చకాయ, దోసకాయ చెందిందన్న మాట. స్పైసీ చేయడానికి, రైతాలో .. స్వీట్స్ లో సోరకాయను బాగా ఉపయోగిస్తారు. ఈ సొరకాయతో చేసే వంటలు ఎంతో రుచిగా ఉండడమే కాకుండా అంతే ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాదు దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వున్నాయంటే నమ్ముతారా? ఈ సొరకాయ ఆరోగ్యానికి ఎంతమంచిదో.. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సోరకాయ ఆరోగ్యానికి మంచిదే గా.. అయినా కూడా అనారోగ్యానికి హాని ఎందుకు అనే కదా.. అవి ఏమిటి.. ఎలా వస్తాయో చూద్దాం.
బరువు తగ్గాలనే వారికి ఇది మంచిగా ఉపయోగ పడుతుంది. సోరకాయలో నీటి శాతం ఎక్కుగా వుండడం వల్ల చాలా మంది వారి డైట్ లో ఇది ఉపయోగిస్తే మంచిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డీహైడ్రేషన్, మలబద్దకం వంటివి దూరమవుతాయి. దీని రోజు తినడం వల్ల షుగర్ బారిన పడిన వారికి మంచి టానిక్ లా ఉపయోగపడుతుంది. ఇందులో వున్న విటమిన్‌లు బాగా మేలు చేస్తాయని నిపుణులు నిర్ధారించారు. దీన్ని జ్యూస్ చేసుకుని తాగాలనుకునే వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి.. కానీ ఇందులో చెక్కర కలిపి తాగడం మంచి కాదు. దీని వల్ల అనారోగ్యాని గురవుతారనేది గుర్తుపెట్టుకోండి.
కొందరు నిపుణులు సొరకాయలో విషపదార్థాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఇందులో కుకుర్బిటాసిన్ అనే టెట్రాసైక్లిక్ ట్రైటెర్ పెనాయిడ్ సమ్మేళనాలతో విషపూరితంగా వుంటాయిని పేర్కొన్నారు. సొరకాయ తినడానికి చేదుగా వుంటుంది.. కానీ ఇది విషంగా మారే అవకాశాలు కూడా ఎక్కువే అని చెప్పచ్చు. సోరకాయ మొక్క శాకాహారం తినే జంతువులకి పూర్తీ విరుద్దంగా తనకు తానే రక్షించుకునేందుకు విషాన్ని బయటకు పంపిస్తుంది. కానీ.. దీని విరుగుడు ఇప్పటి వరకు కనుక్కోలేక పోయారు నిపుణులు. వగరు రుచిలో వున్న సోరకాయ, మనశరీరంలో చాలా సమస్యలకు కారణమవుతుందనే చెప్పొచ్చు. దీని ఆరగించడంతో వాంతులు, విరోచనాలు, హెమటేమిసిస్ . కడుపులో నొప్పి లాంటివి వస్తాయి. కావున జ్యూస్ చేసేప్పుడు.. లేక తినడానికి కూరగాయాలు కోసేటప్పుడు కొంత రుచి చూసి చేదుగా అనిపిస్తే మాత్రం తినకుండా ఉండడమే మేలని నిపుణులు చెబుతున్నారు. సోరకాయ తిన్న చాలామందికి విషపూరిత లక్షణాలైన.. వాంతులు, అతిసార, జీర్ణ సమస్యలు, హైపోటెన్షన్ వంటి ఎదుర్కోవల్సి వస్తుందని ఓ పరిశోధనలో తేల్చారు. సుమారు 50 నుంచి 300 మిల్లీలీటర్ల కుకుర్బిటాసిన్ వల్ల జీర్ణశయాంతర రక్తస్రావం వంటి లక్షనాలకు గురికావాల్సి వుంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నారు. స్లిమ్ గా వుండాలని, షుగర్ తగ్గాలని కొందరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఈ లక్షణాలు ఎక్కవగా వుండే అవకాశం వుంటుంది.
చేదుగా వుండే సోరకాయను తినడం వల్ల తాహిరా కశ్యప్ కి వచ్చిన ఇబ్బందులను తెలిపారు. ఒకరోజు జ్యాస్ చేదుగా ఉన్న పర్లేదని దాన్ని తాగటం వల్ల 17 సార్లు వాంతులు, బీపి 40 కాడంతో.. రెండు రోజులపాటు ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. మీరు కూడా సోరకాయ తీసుకునే ముందు ఓ చిన్న ముక్కను కొరికి చూసి, అది సాధారణంగా అనిపిస్తే దానిని జ్యూస్‌లా చేయడం, వండుకోవడం మంచిదని, చేదుగా అనిపిస్తే పారేయడం ఉత్తమమని ఆమె సూచించారు. అయితే ఫ్రండ్స్ మీరు తినే సొరకాయతో కాస్త జాగ్రత్త సూమా..
Pakistan Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాక్.. పుస్తకాలకు కూడా డబ్బుల్లేవ్..