NTV Telugu Site icon

Curd: వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?

Perugu

Perugu

Curd: రోజు పెరుగు తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిస్తాయి. పాలలో ఉండే దాని కంటే కంటే పెరుగులో ఎక్కువప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. పెరుగు తిన్న తర్వాత 1 గంటలో 91 శాతం జీర్ణం అయితే అదే టైంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు తెలిపారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం లాంటిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా పెరుగు తినడం వల్ల పిల్లలు, వయసు మళ్లిన వారిలో జీర్ణ శక్తి తొందరగా అవుతుంది.

Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు”పై పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌గా జగదాంబికా పాల్ నియామకం..

అంతే కాదు పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టకు చాలా మేలు చేస్తుంది. అలాగే ఎముకలను, కండరాలను ధృడంగా ఉంచేందుకు పెరుగు ఎంతగానో సహాయ పడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అందుకే చాలా మంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటారు. సీజన్ తో సంబంధం లేకుండా తెగ లాగించేస్తుంటారు. మరి కొంతమంది వర్షాకాలం, చలికాలంలో పెరుగు తినడం వలన జలుబు, దగ్గు వస్తుందని భయపడతారు. అయితే, కొన్ని నివేదికల ప్రకారం.. వర్షాకాలంలోనూ పెరును తినవచ్చు.. రెయినీ సీజన్ లో ప్రతిరోజు రెండు పూటల 200 గ్రాముల పెరుగును తినడం వల్ల మలబద్ధకం ఉన్నవారికి ఆ సమస్య పోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Read Also: Harish Shankar: మిస్టర్ బచ్చన్ ట్రూ ఇన్సిడెంట్.. ఎక్కడా లొంగలేదు: డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ

అలాగే, వర్షకాల సీజన్ లో పెరుగు తినడం వల్ల డయోరియా లాంటి వ్యాధులు కూడా దరిచేరవంటున్నారు. ఊబకాయం, అధిక బరువుతో బాధపడేవారికి బరువు తగ్గడానికి ఈ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారకుండా, గుండెను ఆరోగ్యంగా ఉంచి, గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తుందని నిపుణలు అంటున్నారు. అలాగే, పెరుగులో ఉండే కాల్షియం, ప్రొటీన్, విటమిన్ డి లాంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ, పెరుగును ఎప్పుడూ కూడా రాత్రివేళల్లో కాకుండా ఉదయం కానీ లేదా మధ్యాహ్న సమయంలో తినాలని డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. అతిగా పెరుగు తిన్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. అందుకే వర్షాకాలంలో పెరుగు తినే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఒక వేళ రాత్రివేళల్లో పెరుగు తినే అలవాటు ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి.. లేదంటే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు..

Show comments