Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Film Celebrity Interviews Harish Shankar Interview For Mr Bachchan Movie

Harish Shankar: మిస్టర్ బచ్చన్ ట్రూ ఇన్సిడెంట్.. ఎక్కడా లొంగలేదు: డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ

Published Date :August 13, 2024 , 5:36 pm
By Bhargav Chaganti
Harish Shankar: మిస్టర్ బచ్చన్ ట్రూ ఇన్సిడెంట్.. ఎక్కడా లొంగలేదు: డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Harish Shankar Interview for Mr Bachchan Movie: మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబో మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. మిస్టర్ బచ్చన్ లో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఆగస్టు 14 సాయంత్రం నుంచి ప్రిమియర్స్ ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ హరీష్ శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘మిస్టర్ బచ్చన్’ కి ది ఓన్లీ హోప్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు కదా.. ఇందులో హీరో ఇచ్చే హోప్ లో స్పెషాలిటీ ఏమిటి?
-ఇందులో హోప్ హీరో క్యారెక్టరైజేషన్. ఈ సినిమా చేయడానికి రీజనే హానెస్టీ వున్న హీరోయిజం. ఇదొక ట్రూ ఇన్సిడెంట్. 80s ప్రాంతంలో నార్త్ ఇండియాలో జరిగింది. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేసిన కథ. ఆ రోజుల్లో లక్షల రూపాయల లంచం ఇస్తామని ఆఫర్ చేసినా సరే ఓ ఆఫీసర్ ఎక్కడా లొంగలేదు, నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది.

Also Read

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
  • JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
  • Dhanush: రామ్ చరణ్‌ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
  • Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

ఇందులో ఎంటర్ టైన్ మెంట్ ని ఎలా బిల్డ్ చేశారు ?
-‘రైడ్’ కి దీనికి అజయ్ దేవగన్ కి రవితేజ కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. రవితేజ గారికి తగ్గట్టు సినిమా ఉంటుంది. హానెస్ట్ వున్న వ్యక్తుల జీవితంలో ఫన్ రొమాన్స్ లవ్ అన్నీ వుంటాయి. ఇందులో తన ప్రేమలో నిజాయితీ ఉంటుంది. తను చేసిన ఫైట్ లో నిజాయితీ ఉంటుంది. నిజాయితీ అనే పాయింట్ నుంచి అన్నీ వచ్చాయి.

-రైడ్ కాస్త సీరియస్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకటే బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అలా చూసినప్పుడు ఆడియన్స్ కి కొంచెం స్ట్రెస్ వస్తుంది. ఇందులో అది ఎవైడ్ చేశాం. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ ఎలా వచ్చిందో మీరు చూసినప్పుడు అర్థమైపోతుంది.

కమర్షియల్ సినిమా టెంప్లెట్ ఇలా వుండాలని మిమ్మల్ని ఇన్ఫ్లూయెన్స్ చేసింది ఎవరు ?
-మా నాన్నగారు. ఆయన అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నాకు సినిమా ఇష్టమని ఆయనకి అర్ధమైపోయింది. చిన్నప్పటి నుంచి తెలుగు, హిందీ లిటరేచర్, సినిమాలు అంటే ఇష్టం. జంధ్యాల గారు, బాపు రమణ గారు సినిమాల్లో మాటలు విపరీతంగా వినేవాడిని. అలాగే ఈవీవీ గారి సినిమాలకి కూడా ఎట్రాక్ట్ అయ్యాను.

మీ సినిమాల్లో పాటలు సూపర్ హిట్ అవుతాయి.. మిస్టర్ బచ్చన్ పాటలన్నీ చాలా బాగున్నాయి. మిక్కీ తో వర్క్ చేయడం గురించి ?
-మిస్టర్ బచ్చన్ మ్యూజిక్ అంత వన్ వీక్ లో చేశాం. వన్ వీక్ లో నాలుగు చార్ట్ బస్టర్ ట్యూన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ గా కొన్ని సార్లు ఫెయిల్ అయినా నా పాటలు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఆదిత్య మ్యూజిక్ వారు హరీష్ శంకర్ హిట్స్ అని క్యాసెట్ రిలీజ్ చేశారు. నాకు మొదటి నుంచి పాటలు చాలా ఇష్టం. గద్దలకొండ గణేష్ లో అన్ని పాటలు హిట్టు. మిక్కీ మోస్ట్ అండర్ రేటెడ్ కంపోజర్ అని నా ఫీలింగ్. మిక్కీ చాలా మితభాషి. మా ఇద్దరి కాంబినేషన్ బాగా మ్యాచ్ అయ్యింది.

లిరిక్స్ విషయంలో చాలా జాగ్రతలు తీసుకుంటారు కదా ?
-నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం చాలా ఇష్టం. సినిమా చూడని రోజు వుంటుందేమో కానీ పాట వినని రోజు వుండదు. ఒక మంచి వాక్యం ఇచ్చిన స్ఫూర్తి మరేది ఇవ్వలేదు. నాకు మ్యూజిక్ ఒక థెరపీ. ముఖ్యంగా లిరిక్స్ ని చాలా శ్రద్ధగా వినడం, స్ఫూర్తి పొందడం అలవాటు. ‘మా ఊపిరి నిప్పుల ఉప్పెన.. మా ఊహల కత్తుల వంతెన'(వేటూరి) ఇలాంటి వాఖ్యలు విన్నప్పుడు గొప్ప ఎనర్జీ వస్తుంటుంది. నా పాటలు కూడా ఇలా లిరిక్స్ తో గుర్తు చేసుకోవాలనేది తాపత్రయం. ఇందులో కాసర్ల శ్యామ్, వనమాలి, భాస్కర భట్ల, సాహితీ చాలా చక్కని సాహిత్యం రాశారు.

ఇందులో రవితేజ గారిని ఎలా చూపిస్తున్నారు ?
– ఎవరూ చూడని బ్యాక్ డ్రాప్ లో మనం మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తు చేస్తూ, మనకి గుర్తున్న జ్ఞాపకాల్ని చూపిస్తూ, రవితేజ గారి నుంచి ఏం ఆశిస్తారో అలాంటి ఎలిమెంట్స్ తో సినిమాని తీర్చిదిద్దాం. సెకండ్ హాఫ్ లో రవితేజ గారి పెర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ చాలా కొత్తగా ఫీలవుతారు. నటుడిగా ఆయనలో ఒక కంప్లీట్ నెస్ కనిపించింది. ఐటీ ఆఫీసర్ కి సూట్ అయ్యేలా రవితేజ గారు తనని మలచుకున్నారు, రవితేజ గారికి సూట్ అయ్యేలా కథని మలుచుకున్నాం. రెండు బ్యాలెన్స్ చేశాం.

ఈ సినిమాని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు కదా.. ప్రొడ్యూసర్ సపోర్ట్ గురించి ?
-విశ్వప్రసాద్ లేకపోతే ఈ సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చేది కాదు, 15న రిలీజ్ చేసేవాళ్ళం కాదు. మార్కెట్, ఫైనాన్సియల్ ఈక్వేషన్స్ తో సంబంధం లేకుండా మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తునప్పుడు కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో బిజీ అయ్యారు. కాంపెయిన్ నుంచి రిజల్ట్ వచ్చేవరకూ ఈ సినిమా ఫినిష్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాం. రవితేజ గారు లాంటి హీరో, విశ్వప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడంతో అనుకున్న సమయానికి కంప్లీట్ అయ్యింది.

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి ?
-90s బ్యాక్ డ్రాప్ లో ఒక వీధిలో జిక్కీ అనే అమ్మాయి వుండాలి అన్నప్పుడు.. అ అమ్మాయికి గత సినిమాల ఇమేజ్ ఉండకూడదని కొత్త అమ్మాయిని తీసుకున్నాం. తను చాలా హార్డ్ వర్క్ చేసింది, అద్భుతంగా పెర్ఫార్ చేసింది.

ఇందులో జగపతి బాబు గారిది డ్యూయల్ రోల్ నా ?
-లేదండి. సింగిల్ రోలే. ఆయన ఒక ఎంపీ గా కనిపిస్తారు.

ఇందులో నాలుగు ఫైట్స్ వున్నాయి కదా.. మాస్ ఆడియన్స్ కి హై ఎలా వుంటుంది?
-ఈ నాలుగు ఫైట్లే పది ఫైట్ల ఇంపాక్ట్ ఇస్తాయి. రవితేజ గారి సినిమా అంటే మాస్ తో పాటు ఫ్యామిలీస్ కూడా చూస్తారు. ఈ సినిమా హోల్సమ్ ఎంటర్ టైనర్.

డీవోపీ అయనంక బోస్ తో పని చేయడం గురించి ?
-ఇది మేము కలిసి చేసిన నాలుగో సినిమా. మరో పది సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నా విజన్ ని మార్చారు. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.

ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి గురించి ?
-కేజీఎఫ్ చూసిన తర్వాత నన్ను ఫస్ట్ ఎట్రాక్ట్ చేసింది ఎడిటింగ్. చాలా నచ్చింది. అప్పుడే ఎడిటర్ గురించి అడిగాను. ఒక రోజు నా ఆఫీస్ కి వచ్చాడు. తనని చూసి షాక్ అయ్యా. ఇరవై మూడేళ్ళ కుర్రాడు. తనతో ఇంటరాక్షన్ బాగా నచ్చింది. మొదట ఉస్తాద్ భగత్ సింగ్ కి పెట్టాను.

మిస్టర్ బచ్చన్ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు ?
-మిస్టర్ బచ్చన్ మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది. ఖచ్చితంగా సినిమా రిపీట్ ఆడియన్స్ వచ్చేలా వుంటుంది. ఆగస్ట్ 14 సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రిమియర్స్ వుంటాయి. ఆగస్ట్ 15న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harish Shankar Interview
  • Mr Bachchan Movie

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions