గత పది సంవత్సరాలుగా ఆటిజం చిన్న పిల్లల్లో వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యల గురించి ప్రముఖ హోమియో గ్రూప్ Dr Care అధినేత, హోమియో వైద్యులు డాక్టర్ AM Reddy గారు ఎంతో పరిశోధన చేసి, ఎన్నో వందల కేసుల్ని విజయవంతంగా టీ చేసినందుకు గుర్తింపుగా ఈరోజు ముంబైలో ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు ఏర్పాటు చేసినటువంటి అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సందీప్ పాటిల్ గారి చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు అందుకోవడం జరిగింది.
ఈ సందర్భంలో సందీప్ పాటిల్ గారు మాట్లాడుతూ.. ఈరోజు భారతదేశమంతటా ఆటిజం మరియు ADHD కేసులు ఎక్కువ అవుతున్నాయని , వీటి మీద ఎన్నో పరిశోధనలను చేసి ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ A M రెడ్డి గారిని సత్కరించడం ఆనందంగా ఉంది అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనేక మంది సినీ ప్రముఖులు పెద్దలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో Dr Reddy గారు మాట్లాడుతూ.. ఒక తెలుగు వ్యక్తిగా ఇది తనకు ఎంతో గర్వకారణంగా ఉందని, ఇకపై తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన ఒక ప్రకటనలో తెలియజేసారు. భవిష్యత్తులో జీరో మెడికేషన్ విధానం ద్వారా, ఇమ్మ్యూనిటి, ఇమ్మ్యూనోథెరపీ విధానాల ద్వారా ఆటిజంను మరింత సమర్ధవంతంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లల విషయంలో ఎంతో బాధ పడుతున్నారని, హోమియోపతి ద్వారా సమర్ధవంతంగా దీనిని సకాలంలో గుర్తిస్తే నయం చేయవచ్చని ఆయన తెలిపారు.