OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో.. ఎవరిని దించేస్తారో చెప్పడం కష్టం. పవన్ మీద ఈగ వాలినా ఊరుకోరు. అలాగే పవన్ మీద ఎవరైనా పాజిటివ్ గా ఉంటే వారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మరో హీరోయిన్ కు ఇలాగే సపోర్టు చేస్తున్నారు ఆమె ఎవరో కాదు ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. ఆమె ఓజీ ప్రమోషన్లలో పవన్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తోంది. మొన్న ఓ టీవీ షోలో ఓజీ చీర కట్టుకుని వచ్చింది. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పవన్ ఫ్యాన్స్ ను హుషారెత్తించింది.
Read Also : OG : సుజీత్ తో సినిమా చేయడానికి కారణం ఆ డైరెక్టరే : పవన్
పవన్ కల్యాణ్ అంటేనే తుఫాన్.. ఆ తుఫాన్ కోసం మేం అంతా వెయిట్ చేస్తున్నాం. పవన్ ఫ్యాన్స్ ఉన్నంత వరకు ఓజీకి తిరుగులేదు అంటూ చేసిన కామెంట్లతో ఆమె బాగా హైలెట్ అయింది. అందుకే ఆమెను పవన్ ఫ్యాన్స్ బాగా మోసేస్తున్నారు. ప్రియాంక పెట్టే పోస్టులను కూడా బాగా వైరల్ చేస్తున్నారు. ఈ కామెంట్లు చేసినప్పటి నుంచే ప్రియాంకకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా బాగా పెరిగారు. అఫ్ కోర్స్.. వారంతా పవన్ ఫ్యాన్సే అనుకోండి. ఓజీ సినిమా విషయంలో ప్రియాంక పవన్ మీద చేస్తున్న పాజిటివ్ కామెంట్లే ఆమెకు ఇలాంటి ఫాలోయింగ్ తెచ్చిపెడుతోంది.
Read Also : OG : జానీ సినిమా చూసి సుజీత్ అలా చేశాడు.. పవన్ కామెంట్స్