ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని రక్షించుకుంటే.. జీవితకాలంలో ఏర్పడే వ్యాధులకు దూరంగా ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా చేసే అలవరుచుకునే ఆహారా అలవాట్లతో మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఏమి తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నా.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఇదే విషయాన్ని ప్రతి ఇంట్లోని పెద్దవారు చెబుతూనే ఉంటారు. అయితే.. ఉపవాసం చేయడం వల్ల ఖాళీ కడుపుతో, చాలా మందికి ఎసిడిటీ, కడుపు నొప్పి, వాంతులు, బ్లడ్ షుగర్ వంటి సమ్యసలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి పరస్థితుల్లో ఉదయాన్నే ఏదైనా అల్పాహారం తినాలని నిపుణులు సూచిస్తుంటారు.
అలాగే.. ఖాళీ కడుపుతో ఉన్నట్లు కొన్ని ఆహార పదార్థాలను అసలు తినకపోవడమే మంచిదని కూడా చెబుతున్నారు. అయితే ఉదయం లేవగా మద్యం సేవించరాదు. ఉదయన్నే ఖాళీ కడుపుతో మద్యం తాగితే మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని, అలా మద్యం సేవించడం వల్ల సరాసరి అది మీ రక్తంలోకి కలిసిపోతుందని వైద్యులు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అది మీ శరీరమంతటా వ్యాపించి.. పల్స్ రేటు పడిపోయే అవకాశం ఉందని వైద్యుల మాట. అటువంటి పరిస్థితిలో కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయంలో సమస్యలు రావచ్చని వైద్యులు సూచిస్తారు.
దీంతో పాటు. ఖాళీ కడుపుతో కాఫీ తాగరాదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా మంది కాఫీ తాగడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ వంటి పానీయాలను తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే.. చూయింగ్ గమ్ నమలడం వద్దని చెబుతున్నారు వైద్యులు.. చాలా మంది ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ కూడా నములుతూ ఉంటారు కొందరు. అలాంటి అలవాటు ఉన్న వారు వెంటనే మానుకోవడం మంచిదని వైద్యులు హితవు పలుకుతున్నారు. ఎందుకంటే ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం వల్ల మన పొట్టలో జీర్ణ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ డైజెస్టివ్ యాసిడ్స్ ఖాళీ కడుపులో ఎసిడిటీ నుంచి అల్సర్ల వరకు అనేక సమస్యలకు దారి తీస్తుందని, కాబట్టి మీరు ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.