Health Tips: పొట్ట సమస్యతో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే చాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొట్ట.. ఈమధ్య కాలంలో చాలామందిని బాధిస్తోన్న అతిపెద్ద సమస్య ఇది! ఇంట్లో తినడం, ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, తిరిగి ఇంటికి వెళ్ళగానే బెడ్‌పై పడిపోవడం.. ఇవే అందరి జీవితాల్లో రోజువారి దినచర్యలు అయిపోయాయి. శారీరక శ్రమ అన్నది ఏమాత్రం లేదు. దీనికితోడు జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయారు. పిజ్జాలు, బర్గర్స్‌తో పాటు విచిత్రమైన ఆహారాల్ని తీసుకుంటున్నారు. తద్వారా పొట్టలో కొవ్వు బాగా పేరుకుపోతోంది. దీంతో పొట్టలు బస్తాలుగా మారిపోతున్నాయి. మన శరీరంలో ఒక ప్రత్యేక బ్యాగేజ్‌లాగా పొట్టలు తయారవుతున్నాయి.
కొందరికి మానసిక ఒత్తిడి, సరిపడినంత నిద్ర లేకపోవడం, జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల.. బానపొట్ట వచ్చేస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు వంటివి.. శరీరంలోని హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి.. ఆందోళనలు, ఒత్తిళ్ళు పెరుగుతాయి. దీని వల్ల కూడా పొట్ట లావు అవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి, ఈ సమస్య నుంచి ఎలా బయడపడటం? చాలామంది రకరకాల కసరత్తులు చేసినప్పటికీ, ఆశించిన ఫలితాలు రాక సతమతమవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ సాధారణమైన టిప్స్. సమయానుకూలంగా సరైన ఆహారం, వ్యాయామం చేస్తే.. ఈ సమస్యని అధిగమించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ఆహార పదార్థాల విషయానికొస్తే.. పీచు అధికంగా ఉండే బీన్స్, బ్రోకలీ, బెర్రీ పండ్లు, అవకాడో, యాపిల్, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఫైబర్ ఎక్కువ శాతంలో ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా ఆ ఫైబర్ చేస్తుంది. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు కూడా తరచూ తీసుకోవాలి. వీటితో పాటు పొట్టపై ఒత్తిడి పడే కోర్ వ్యాయామాలు, బరువులెత్తడం, మెట్లెక్కడం.. వంటివి సాధన రెగ్యులర్‌గా చేయాలి. యోగా, ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాల్సిందే! ఈ టిప్స్ అన్నీ పాటిస్తే.. కచ్ఛితంగా పొట్ట సమస్యని పరిష్కరించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు