ఈరోజుల్లో చాలా మంది బరువు పెరుగుతున్నారు.. అదొక పెద్ద సమస్యగా మారింది..బరువు పెరగడం చాలా సులభం.. కానీ బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గడం చాలా కష్టం.. అధిక బరువు మిమ్మల్ని హేళన చెయ్యడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా తీసుకొని వస్తుంది..అదే సమయంలో, నేటి కాలంలో బరువు తగ్గడానికి ప్రజలు డైటింగ్, జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇంత చేసినా బరువు తగ్గడం లేదు. అటువంటి పరిస్థితిలో మీరు బరువు తగ్గాలనుకున్నా.. తగ్గే క్రమంలో సాయంత్రం వేళల్లో కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి.. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
1. బరువు తగ్గడానికి తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. అర్థరాత్రి వరకు మేల్కొని ఉండటం వల్ల బరువు పెరుగుతుంది. కావున బరువు తగ్గాలనుకుంటే, మీరు మంచి నిద్రను కలిగి ఉండాలి. మీరు రాత్రి 10 గంటల కల్లా నిద్రించడానికి ప్రయత్నించాలి..
2. కాఫీ, టీ లాంటి వేడి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..మీ నిద్రను దూరం చేయడం ద్వారా మీ బరువు తగ్గించే ప్రయాణానికి ఆటంకం కలిగిస్తాయి. అందుకే కెఫిన్ ఉన్న పానీయాలకు బదులు హెర్బల్ టీని ఎప్పుడూ తాగాలి..
3. రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తినే అలవాటు ఉన్నా, అర్ధరాత్రి వేళల్లో తినే అలవాటు ఉన్నా.. దానిని ఈ రోజే వదిలేయండి. ఎందుకంటే మీ ఈ అలవాటు మీ బరువును పెంచడానికి పని చేస్తుంది. అందుకే రాత్రి పడుకునే ముందు ఆహారం తినే అలవాటు మానేయండి. లేకపోతే, మీ బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతుంది..
4. ఇక రాత్రిపూట కేలరీల ఆహారాన్ని తీసుకుంటే, అది మీ బరువును తగ్గించడంలో ఆటంకాలను కలిగిస్తుంది. ఇంకా బరువు పెరుగుతుంది. అందుకే రాత్రి 7 తర్వాత అధిక క్యాలరీల ఆహారాన్ని తినకుండా ఉండటానికి ప్రయత్నించండి.. బరువు వద్దన్నా కూడా పెరుగుతారు.. అందుకే తేలిగ్గా ఉండే వాటిని తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.. ఈ విషయాలను తప్పక గుర్తు పెట్టుకోండి..