చలికాలంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు రావడం కామన్.. అయితే ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా గొంతు నొప్పిని.. ఈ నొప్పిని తగ్గించడానికి ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఇంటి చిట్కాలను వాడితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి.. అలా చెయ్యడం వల్ల కఫమ్ ఉంటే తొలగిపోతుంది.. అదే విధంగా గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి గార్గింగ్ చేస్తే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుంది. వెనిగర్ లేకపోయినా.. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గార్గింగ్ చేసుకోవచ్చు.. అలాగే నీటిలో 4, 5 మిరియాలు, కొన్ని తులసి ఆకులను వేసి ఉడకబెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని తాగాలి. ఈ కషాయాన్ని రాత్రి నిద్రపోయేటప్పుడు తాగితే బాగా ప్రయోజనకరంగా ఉండటంతోపాటు.. గొంతునొప్పి త్వరగా నయమవుతుంది.. బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు..
అంతేకాదు.. గొంతు నొప్పికి మిరియాల పొడిలో కొంచెం నెయ్యి కలిపి సేవిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే నల్ల మిరియాలతోపాటు బాదంపప్పును కలిపి నూరి కొంచెం నీటిలో కలిపి సేవించడం వల్ల కూడా గొంతు వ్యాధులు నయమవుతాయి. ఏమైనా మందులు వాడాల్సి వచ్చినప్పుడు డాక్టర్ ను సంప్రదించి తగు జాగ్రత్తలను తీసుకోవడం మంచిది.. ఆహారాన్ని ఎప్పటికప్పుడు వేడిగా చేసుకొని తినడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.