మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. అందులో బీపి కూడా ఒకటి.. ఇది ఒక్కసారి వస్తే ఇక జీవితంలో పోదు.. అందుకే దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఒక్కటే మార్గం.. అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా ను పాటిస్తే జన్మలో బీపి అనేది రాదనీ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
చాలా మంది ఈ సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ బీపీ సమస్య చిన్న సమస్య కాదని దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. బీపీ కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది కనుక యుక్త వయసులో ఉన్నవారు ఎప్పటికప్పుడు బీపీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. చాలా మంది తమకు ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని పరీక్షలు చేయించుకోరు.. కానీ సైలెంట్ గా మనిషిని ఇబ్బంది పెడుతుందని నిపుణులు చెబుతున్నారు..
బీపి అనేది ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్లు యాలక్కాయలను వాడి అదుపులో పెట్టుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. రోజూ ఉదయం 3 గ్రాములు, సాయంత్రం 3 గ్రాముల యాలకుల పొడిని తీసుకోవడం వల్ల రెండు నుండి మూడు నెలల్లోనే మొదటి దశలో ఉన్న బీపీ అదుపులోకి వస్తుందని వారు చెబుతున్నారు. మందులు వాడే అవసరం లేకుండా యాలకుల పొడిని వాడడం వల్ల మొదటి దశలో ఉన్న బీపీ అదుపులోకి వచ్చిందని పరిశోధనలో వెళ్లడయింది.. గోరు వెచ్చని నీటిలో తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.