చలికాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు కూడా ఎక్కువగా వస్తాయి.. వాటిని నుంచి బయట పడటానికి ఎన్నెన్నో చేస్తారు.. కానీ అల్లంతో ఇలా చేసి తీసుకుంటే చాలు ఆ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు అవేంటో, ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. వాంతులు, వికారం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు జింజర్ క్యాండీలను తినడం వల్లమంచి ఫలితం ఉంటుంది. ఈ జింజర్ క్యాండీలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఈ క్యాండిలను చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, ఎలా చెయ్యాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
అల్లం – అర కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – 2 టీ స్పూన్స్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – పావు టీ స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నిమ్మరసం – 4 చుక్కలు, పటిక బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్స్.. ఇక ముందుగా అల్లం ముక్కలను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, నీళ్లు వేసి కలపాలి. బెల్లం కరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్, యాలకుల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మధ్యస్థ మంటపై కలుపుతూ ఉడికించాలి.. ఇలా చేస్తూ ఉండగా రాగానే స్టవ్ ఆఫ్ చెయ్యాలి..
ఈ అల్లం క్యాండిలతో పటిక వేస్తూ ఉండలుగా చెయ్యాలి.. ఇలా చేసిన వాటిని స్టోర్ చేసుకోవచ్చు.. ఈ ఉండను పటిక బెల్లం పొడిలో వేసి కోటింగ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జింజర్ క్యాండీలు తయారవుతాయి… రోజూ ఒకటి తింటే చాలు హెల్త్ సూపర్ గా ఉంటుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.