Health Tips : శరీరంలోని అతి వేడికి చెక్ పెట్టండిలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరీరంలోని అతి వేడి కారణంగా ఎన్నో సమస్యలు మొదలవుతాయి. ఇక ఎండా కాలంలో అయితే ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. అయితే శరీరంలో వేడి అధికం అవ్వడానికి మసాలా ఆహారాలు తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, అదే పనిగా కుర్చీలో కూర్చొని పనిచేయడం ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే.. దీని వలన మూత్ర విసర్జన సమయంలో చాలా మంటగా, నొప్పిగా రావచ్చు కూడా. అయితే మనం శరీరంలోని వేడిని అతి సులభంగా మన ఇంట్లో ఉన్న పదార్థాలను ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్రను కొద్దిగా పటిక బెల్లం వేసి ఒక రెండు నుండి మూడు గంటల పాటు నానబెట్టాలి. జీలకర్ర , పటిక బెల్లంలు మన శరీర వేడిని తగ్గించడానికి బాగా దోహదపడుతాయి. ఇలా నానబెట్టిన జీలకర్ర, పటిక బెల్లం కలిపిన నీటిని తాగడం వలన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇలా మీరు రోజులో ఒక రెండు సార్లు తాగితే శరీరంలో వేడి అనేది తగ్గిపోతుంది. ఇదే.. మీరు మరో విధంగా కూడా తీసుకోవచ్చు.
జీలకర్ర, పటిక బెల్లంలు సమానంగా తీసుకొని మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఒక డబ్బాలో నిలువ చేసుకోని.. రోజు ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ పొడిని కలిపి తాగాలి. ఇలా రోజులో రెండు సార్లు తాగితే శరీరంలోని వేడి ఇట్టే తగ్గిపోతుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలో మంట వంటివి కూడా ఇబ్బంది పెట్టవు. దీంతో పాటు.. మజ్జికలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తాగినా.. శరీరంలో అతి వేడిని తగ్గించుకోవచ్చు. ఇదికాకపోయినా.. ఒక మూడు నాలుగు టీ స్పూన్ సబ్జా గింజలను తీసుకొని ఒక నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన సబ్జా గింజలను ఒక గ్లాసులోకి తీసుకొని మరి కొన్ని నీటిని కలుపుకొని అందులో ఒక అర చెక్క నిమ్మరసాన్ని పిండాలి. ఇలా తయారుచేసిన పానీయం తీసుకోవడం వలన శరీరంలోని వేడి అనేది చక్కగా తగ్గిపోతుంది.
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
తాజావార్తలు
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?