టమోటల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. విటమిన్ కె, విటమిన్ బి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం,జింక్ ఫైబర్,ప్రోటీన్,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.. అలాగే ఇంకా ఎన్నో పోషకాలు వీటిలో ఉంటాయి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. అయితే పగలు మాత్రమే తినాలట.. రాత్రిపూట మాత్రం అసలు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
టమాటా లో ఉండే టైరమైన్ అనే అమైనో ఆమ్లం గ్యాస్ ఎసిడిటీ గుండెల్లో మంట సమస్యలకు కారణం అవుతుంది.. గ్యాస్ కూడా పడుతుందని చెబుతున్నారు.. నిద్రలేమి సమస్యలు కూడా రావొచ్చు నట.. అందుకే రాత్రి పూట తీసుకోవద్దని చెబుతున్నారు.. ఒక్క టమోటా మాత్రమే కాదు.. కీరాను ను కూడా తీసుకువద్దని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు..
కీరాలో నీళ్లు మాత్రమే ఉంటాయి.. కీరదోస రాత్రి సమయంలో తీసుకుంటే కీరాలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వలన తరచు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. అలాగే బ్రోకలీ కాలీఫ్లవర్ క్యాబేజీ వంటివి కూడా రాత్రి సమయంలో తీసుకోవడం వలన వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడం ఆలస్యం అయి కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అందుకే రాత్రి ఏడు తర్వాత టమోటాలను అస్సలు తీసుకోవపోవడమే మంచిది…
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.