Site icon NTV Telugu

Health News: పరగడుపున ఈ జ్యూస్ తాగొద్దు.. ప్లీజ్

Juice1

Juice1

మనలో చాలామంది బరువు తగ్గడానికి జ్యూస్‌లు ఎక్కువగా తాగుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ మానేసి మరీ జ్యూస్‌ ల మీద పడతారు. పరగడుపున వాకింగ్, జాగింగ్ తర్వాత మీకు జ్యూస్ తాగే అలవాటుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా సీజనల్ వంటి ఎక్కువ సిట్రస్ పండ్ల రసాలను ఉదయం తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

ఎందుకంటే ఈ పండ్లలో సిట్రస్ కంటెంట్ ఉంటుంది. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది. ఎసిడిటీ లాంటివి కలుగచేస్తాయి. అలాగే చల్లని జ్యూస్‌ కూడా తాగడం మంచిది కాదు. శరీరంలో శ్లేష్మ పొరలు దెబ్బతిని జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కలుగుతాయి. చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే జ్యూస్‌ తాగడం అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

వీటిని తాగడానికి ముందు కొంత ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతకంటే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగితే మంచిది. ఎందుకంటే గోరువెచ్చని నీరు శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను బయటకు పంపేస్తుంది. ఉదయం వేడినీళ్ళు తాగాక కాలకృత్యాలు తీర్చుకుంటే ఆరోజంతా ఉల్లాసంగా వుంటారు. శరీరం బరువుగా కాకుండా తేలికగా మారుతుంది. కొన్ని రకాల జ్యూస్‌ ల వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలను ఇస్తాయి. ఉదయం నూనె పదార్ధాలు, ఫ్రైలు కాకుండా ఇడ్లీ లాంటివి లైట్ ఫుడ్ తీసుకోవాలి.

Health Tips: జామకాయ తింటే.. టైప్‌ 1 డయాబెటిస్‌ కంట్రోల్‌

Exit mobile version